Share News

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:37 AM

వ్యవసాయరంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం 2024-25 సంవత్సరంలో పొలంబడి జీఎపీ (గుడ్‌అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌) సర్టిఫికేషన్‌ ప్రొగ్రామ్‌పై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించాలి

  • సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు లాభసాటి అయ్యేలా కృషి

  • పొలంబడి ‘గాప్‌’ సర్టిఫికేషన్‌ శిక్షణలో కలెక్టర్‌ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం సిటీ, జూలై 26: వ్యవసాయరంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం 2024-25 సంవత్సరంలో పొలంబడి జీఎపీ (గుడ్‌అగ్రికల్చర్‌ ప్రొడక్ట్స్‌) సర్టిఫికేషన్‌ ప్రొగ్రామ్‌పై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సాగు విధానం దిశ లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా తీర్చిదిద్దడమే కాకుండా, వారు పండించిన పంటలకు తగిన ధరలు కలుగజేసేలా కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో రైతులకు ఆధునిక పద్ధతులు ఆచరించేలా చేయడం, పొలంబడి కార్యక్రమాలను గ్రామం ఒక యూనిట్‌గా చేపట్టాల్సి ఉందన్నా రు. ఈ ప్రక్రియలో వ్యవసాయ అధికారుల పాత్ర కీలకం అన్నారు. రైతులను, మార్కెటింగ్‌ వర్గాలను భాగస్వామ్యం చేసి మనందరి కార్యక్రమనే దృక్పఽథం కలుగజేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ లక్ష్యంతో అన్నదాతలకు తగిన ప్రోత్సాహం, మద్దతు ఇవ్వడం ద్వారా వారిని ఆరోగ్యదాతలుగా మార్చడం సాధ్యమవుతుందన్నారు. మంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి తగిన గుర్తిం పు తీసుకొని రావడంలో అధికార ధోరణిలో కాకుండా రైతుల, సామాజిక కోణంలో ప్రోత్సాహం అందించి వారిని భాగస్వామ్యం చేయాలని కోరారు. నేటి ఆధునిక పోకడలను దృష్టిలో పెట్టుకొని పొలంబడులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తూ మేలైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులు రైతులకు అందు బాటులో తీసుకొని రావడం వ్యవసాయ అధికారుల కర్తవ్యం అని స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌ మాధవరావు మాట్లాడుతూ గతేడాది జిల్లాలో కేవలం ఒక్క గాప్‌ పొలంబడి కార్యక్రమం నిర్వహించామని, మంచి వ్యవసాయ పద్ధతులను అభ్యసించే దిశగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు శిక్షణ తరగతులను చేపట్టినట్టు చెప్పారు. ఈ శిక్షణలో జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు, డివిజనల్‌, మండలస్థాయి వ్యవసా యాధికారులు, మాస్టర్‌ శిక్షకులు కె.కమల్‌రాజు, ఎ.భీమారాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 07:56 AM