Share News

ఓపీఎస్‌ అమలు చేయాలి

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:10 AM

ఓపీఎస్‌ అమలు చేయాలంటూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) పిలుపుమేరకు బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నాచేశారు. ఈ సందర్బంగా ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం సీపీఎస్‌ అమలు చేసిన రోజు సెప్టెంబరు 1న వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశామని చెప్పారు.

ఓపీఎస్‌ అమలు చేయాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నాచేస్తున్న ఎస్టీయూ నాయకులు

రాజమహేంద్రవరం రూరల్‌, సెప్టెంబరు1: ఓపీఎస్‌ అమలు చేయాలంటూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) పిలుపుమేరకు బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నాచేశారు. ఈ సందర్బంగా ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం సీపీఎస్‌ అమలు చేసిన రోజు సెప్టెంబరు 1న వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఓపీఎస్‌ మాత్రమే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఆమోదమని, దాని అమ లుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎసీ ్టయూ జిల్లా అధ్యక్షుడు డేనియల్‌బాబు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, రాష్ట్ర నాయకుడు సూరిబాబు, త్రినాథ్‌, నాయకులు అయ్యో సుబ్బారావు, భరద్వాజ్‌, రాజబాబు, లక్ష్మినారాయణ, దాసరి శివ, సత్యమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 12:10 AM