Home » AP Districts
ఓపీఎస్ అమలు చేయాలంటూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) పిలుపుమేరకు బొమ్మూరు కలెక్టరేట్ వద్ద ధర్నాచేశారు. ఈ సందర్బంగా ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం సీపీఎస్ అమలు చేసిన రోజు సెప్టెంబరు 1న వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశామని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది పేదలకు పెద్ద దిక్కు.. అనంతపురం సర్వజన వైద్యశాల. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, వ్యాధులు ప్రబలినా.. పరిగెత్తుకుంటూ పెద్దాసుపత్రికి వస్తారు. వీరిని అత్యవసరంగా పరీక్షించి.. తగిన వైద్యసేవలు అందించి.. ప్రాణాలు కాపాడటంలో కీలకంగా పనిచేసే విభాగం.. క్యాజువాలిటీ..! ఇలాంటి చోట తగినన్ని పడకలు, మౌలిక వసతులు కల్పించాలి. కానీ అలాంటివేవీ కనిపించవిక్కడ..! రోజుకు 300 నుంచి 400 మంది వరకూ రోగులు క్యాజువాలిటీకి వస్తారు. కానీ ఉన్న పడకలు 20 మాత్రమే..! అత్యవసర వైద్యం అందించి.. సంబంధిత విభాగాలకు పంపేందుకు కనీసం గంట పడుతుంది. ...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...