Share News

ఇద్దరు మంత్రులకూ.. ముచ్చెమటలు

ABN , Publish Date - May 09 , 2024 | 01:22 AM

జిల్లాలో మంత్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఐదేళ్ల పాటు అఽధికారం అనుభవించిన రాష్ట్రం హోంమంత్రి తానేటి వనిత, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుకు తమ నియోజకవర్గాల్లో ఎదురీత తప్పడం లేదు.

ఇద్దరు మంత్రులకూ.. ముచ్చెమటలు

గోపాలపురంలో తానేటివనిత.. రూరల్‌ లో వేణు ఎదురీత

డీలాపడుతున్న వైసీపీ అభ్యర్థులు

దూసుకుపోతున్న కూటమి

జిల్లాలో రాజకీయం రసవత్తరం

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మంత్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఐదేళ్ల పాటు అఽధికారం అనుభవించిన రాష్ట్రం హోంమంత్రి తానేటి వనిత, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుకు తమ నియోజకవర్గాల్లో ఎదురీత తప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. ఉద్యోగులంతా వన్‌సైడ్‌గా కూటమికి అనుకూలంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటేసినట్టు ప్రచారం సాగడమే దానికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైసీపీ అభ్యర్థులకు ఉక్కబోతతో పాటు ముచ్చెమటలు పడుతున్నాయి.ఇక ఎన్నికలకు మూడే రోజుల సమయం ఉంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రంతో ప్రచారం నిలిపివేయాలి.దీంతో వైసీపీ అభ్య ర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. టీడీ పీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో ప్రజల భుజం తట్టగా.. వైసీపీ మేనిఫెస్టో చతికిలపడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సీఎం జగన్‌ విధానాలకు అన్ని వర్గాల ప్రజలు విసిగివేసారిపోయారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని మంత్రులతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా ఎదురీదక తప్పడం లేదు. జిల్లాలో రాజమహేం ద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థిగా కూటమి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే ప్రజల మనసులు చూరగొన్నారు. జనం నోట ఆమె మాటే వినిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్థి డా.గూడూరి శ్రీనివాస్‌ వెనకబడినట్టే. ముఖ్యంగా కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచి, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న తానేటి వనిత ప్రస్తుతం గోపాలపు రం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొవ్వూరులో గ్రూపు తగాదాల వల్ల ఆమెను అక్కడకు పంపారు. కానీ అక్కడా ఆదరణ కనిపించడం లేదు. మంగళవారం రాత్రి నల్లజర్లలో వైసీపీ ర్యాలీలో భాగంగా కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ సీనియర్‌ నేత ముళ్లపూడి బాపిరాజు ఇంటి ముందు కవ్విం పు చర్యలకు దిగడం పెద్ద ఘర్షణకు దారితీసింది. అప్పటికి హోం మంత్రి వనిత అందుబాటులో ఉన్నా పట్టించుకోలేదు. వైసీపీ మళ్లీ వస్తే ఇటువంటి కవ్వింపు చర్యలు తప్పవని.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు బలం గా నమ్ముతున్నారు. గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు వైపే ఓటర్లు చూస్తున్నారు. దానికి తోడు సీనియర్‌నేత ముళ్లపూడి బాపిరాజు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనసేన అండగా ఉంది. ఇక రాజమం డ్రి రూరల్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణు కూడా ఎదురీదుతున్నారు. ఆయన స్థానికుడు కాకపోవడంతో పాటు, వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇబ్బందిగా మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంచి వాడనే పేరుంది. పైగా జనసేన, బీజేపీ మద్దతు ఉంది.దీంతో ఆయన ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌ పోటీపడు తున్నారు. భరత్‌కు సిటీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి వాసుకు అన్నివర్గాల మద్దతు లభిస్తోంది. జనసేన, బీజేపీ కేడర్‌ కలిసివస్తోంది. రాజాన గరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా మధ్యనే పోటీ ఉంది.ఆర్బాటమే కానీ అభివృద్ది లేకపోవడంవల్ల రాజాకు కలిసి రావడంలేదు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత జనసేన అభ్యర్థికి లాభంగా మారింది. టీడీపీ కేడర్‌ కూడా కలిసిపనిచేయడంతో మరింత బలం చేకూరింది. అనపర్తిలో వైసీపీ అభ్యర్థి డా.సూర్యనారాయణరెడ్డిపై వ్యతిరేకత పెరిగింది. కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సానుభూతి పెరిగింది.నిడదవోలులో కూటమికి చెందిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ బాగా బలపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పార్టీ శ్రేణులంతా సహకరిస్తున్నాయి.లోపాయికారిగా పనిచేసేవారు అనేక మంది ఉన్నారు. కూటమి అభ్యర్థిని ఎదుర్కోవడం వైసీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడుకు సాధ్యం కావడంలేదు.వైసీపీ పట్ల వ్యతిరేకత వల్ల కూడా ఆయన వెనకబడ్డారు.కొవ్వూరులో కూటమి టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు జోష్‌ మీద ఉన్నారు. పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబుతో పాటు పార్టీ కేడర్‌ తోడుగా ఉంది. వైసీపీలో విబేధాలు కలిసివస్తు న్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు ఇబ్బందికర పరిస్థితులేర్పడ్డాయి.

Updated Date - May 09 , 2024 | 01:22 AM