Share News

పేదలకు ఆసరా ‘పింఛన్లు’

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:08 AM

ప్రభుత్వం అందించే పింఛన్లు పేదలకు ఆసరాగా ఉన్నాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం కె.సావరం, పెరవలి మండలం ఖండవల్లి గ్రామాల్లో మంత్రి దుర్గేష్‌, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పింఛన్లు పంపిణీ చేశారు.

పేదలకు ఆసరా ‘పింఛన్లు’
ఉండ్రాజవరం: కె.సావరంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి దుర్గేష్‌

  • పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌

  • జోరు వానలోనూ లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ

ఉండ్రాజవరం/పెరవలి, ఆగస్టు 31: ప్రభుత్వం అందించే పింఛన్లు పేదలకు ఆసరాగా ఉన్నాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం కె.సావరం, పెరవలి మండలం ఖండవల్లి గ్రామాల్లో మంత్రి దుర్గేష్‌, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సకాలంలో పింఛన్లు అందజేయాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పట్టుదలతో పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం పింఛను ద్వారా లబ్ధిదారునికి భరోసా కల్పిస్తోందని, పేదల అభ్యున్నతి కోసం పింఛనుదారులకు రూ.వెయ్యి పెంచి వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన మండలాధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, వీరమళ్ల బాలాజీ పాల్గొనగా ఖండవల్లిలో భూపతిరాజు రవివర్మ, అతికాల శ్రీను, పులిదిండి నాగరాజు, వనచర్ల దివ్య, కడలి సత్యనారాయణ, రెడ్డి సత్యనారాయణ, మంగం రామారావు, బొడ్డు రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 12:08 AM