Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు పోటెత్తారు..

ABN , Publish Date - May 09 , 2024 | 01:21 AM

జిల్లాలో ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునేందుకు పోటీపడ్డారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు పోటెత్తారు..

రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి, మే 8 : జిల్లాలో ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునేందుకు పోటీపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతా స్పందించారు. జిల్లాలో బుధవారం మూడో రోజు పోలింగ్‌ జరిగింది. పోలీసులు, సచివాలయ ఉద్యోగులు, ఇరిగేషన్‌, ఉపాధ్యాయులు ఇతర ఎన్నికల డ్యూటీలో ఉన్న వారు కూడా ఓటు వినియోగింంచుకున్నారు. రాజమహేంద్రవరం సిటీలో ఇప్పటి వరకూ 4257 మంది, రాజమహేంద్రవరం రూరల్‌ 2519, రాజానగరం 1561 మంది ఓటు వినియోగించుకున్నారు. అనపర్తి 2025, కొవ్వూరు 1252, నిడదవోలు 2458, గోపాలపురం 2649 ఓటేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్లిన గోపాలపురం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్‌ మడకం గంగారత్నం ఓటు వేసేందుకు లైన్‌లో నిలబడి అమాంతం కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేఎల్‌.శివజ్యోతి సొమ్మసిల్లిపడిన మహిళ వద్దకు వచ్చి తన వాహనంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం ఆమె మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు ఎక్కువ మంది రావడంతో నాలుగు లైన్లు కిక్కిరిసిపోయాయని అన్నారు.షుగర్‌తో బాధపడుతున్న తాను ఉక్కబోతకు గురై సొమ్మసిల్లి ప డిపోయానన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:21 AM