Share News

ఇదేనా అభివృద్ధి!

ABN , Publish Date - May 09 , 2024 | 01:24 AM

అభివృద్ధి అంటే భరత్‌.. ఇవీ గతంలో రాజమహేంద్రవరాన సందుసందునా కనిపించే బోర్డులు.. అయితే ఆ అభివృద్ధి ఏంటో మంగళవారం మధ్యాహ్నం కురిసిన ఒక గంట భారీ వర్షానికే తేలిపో యింది.

ఇదేనా అభివృద్ధి!
చెత్త ఎక్కడిదో : ఇటీవల అభివృద్ధి చేశామని చెబుతున్న కంబాల చెరువు పార్కులో ఇలా...

వైసీపీ చేసిన షోతో నగరవాసుల ఇక్కట్లు

రాజమహేంద్రవరం సిటీ, మే 8 : అభివృద్ధి అంటే భరత్‌.. ఇవీ గతంలో రాజమహేంద్రవరాన సందుసందునా కనిపించే బోర్డులు.. అయితే ఆ అభివృద్ధి ఏంటో మంగళవారం మధ్యాహ్నం కురిసిన ఒక గంట భారీ వర్షానికే తేలిపో యింది. ఎందుకంటే ఆ వర్షానికి నగరం మంతా జలమయమైపోయింది.. ఎన్న డూ లేనిది ఏకంగా ఒక కారే కొట్టుకుపోయింది. అభివృద్ధి పేరుతో షో చేయ డంతో నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో కొన్ని పాంతాలు మాత్రమే నీట మునిగేవి.. అయితే వైసీపీ ఎంపీ భరత్‌ చేశానని చెప్పుకుంటున్న అభివృద్ధికి నగరమంతా జలమయమైంది. దీంతో చెత్త పెద్ద ఎత్తున రొడ్డెక్కింది. నగర పారిశుధ్య కార్మికులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్లలో డ్యూటీలు వేయడంతో కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగం అధికారులు అదనంగా 50 మంది కూలీలను పెట్టి నగరంలో కృష్ణనగర్‌, తుమ్మలావ, రామచంద్రరావుపేట, కంబాలచెరువు, టీటీడీ రోడ్డు, వైజంక్షన్‌, హైటెక్‌ బస్టాండ్‌, కోరుకొండ రోడ్డు, స్వతంత్ర హాస్పటల్‌ రోడ్డు, దానవాయిపేట, ప్రకాష్‌ నగర్‌, తిలక్‌రోడ్డు, ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు, ఫారెస్ట్‌ కల్యాణ మండపం రోడ్డు, లలితనగర్‌ ,శ్రీరామ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, చెత్త తొలగింపు పనులు ,రోడ్డును శుభ్రం చేయించే పనులు చేయిస్తున్నారు. ఆయా పనులను శానిటరీ సూపర్‌వైజర్‌ ఇంద్రగంటి శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు సంబంధిత శాఖ అధికారులు తొలగించాలి.దీంతో చెట్ల తొలగింపు పనులు ఆలస్యం అవుతున్నాయి.

అభివృద్ధికి అర్థం ఇదేనా భరత్‌రామ్‌..

రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటన్న భరత్‌ రామ్‌ మాటలకు అర్ధం నిన్నటిరోజు కురిసిన వర్షంతో ప్రజలందరికి పూర్తిగా అర్ధమైంది. నగరంలో అనాలోచితంగా పనులు చేస్తున్నారని.. అభివృద్ధి కాదు సుందరీకరణ మాత్రమేనని పదేపదే చెబుతూనే ఉన్నాం. గొప్పగా అభివృద్ధి చేశామని డబ్బాకొట్టిన భరత్‌ రామ్‌ మంగళవారం వర్షానికి ప్రజలు పడిన ఇబ్బందులు చూసి సిగ్గుపడాలి. - ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ

వైసీపీ అభివృద్ధి తేలిపోయింది..

రాజమహేంద్రవరంలో మంగళవారం కురిసిన వర్షం దెబ్బకు తెలిసింది నగరం లో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమిటో..రాజమహేంద్రవరం పట్టణాన్ని అభివృద్ధి చేసేశామని ఏవో గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఇకనైనా కళ్లు తెరవాలి. ఎన్నడూ లేనిది నగరం నీట మునిగింది. నాలుగు రాళ్లు వేసి నాలుగు లైట్లు పెట్టి అభివృద్ధి చేసేశామని గొప్పలు చెప్పుకునే వైసీపీ పాలకుల డొల్లతనం నిన్నటిరోజున బయటపడింది.- గన్నికృష్ణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Updated Date - May 09 , 2024 | 01:24 AM