Share News

త్వరలోనే రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి

ABN , Publish Date - May 09 , 2024 | 01:41 AM

త్వరలోనే రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించనుందని ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో రామరాజ్యం ప్రజలకు చేరువకానుందని ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్ధ్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

త్వరలోనే రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి

ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, మే 8 : త్వరలోనే రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించనుందని ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో రామరాజ్యం ప్రజలకు చేరువకానుందని ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్ధ్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన నియోజకవర్గంలో సుడి గాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. పెదపూడి మండలం పెద్దాడలో రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణచౌదరితో కలిసి ప్రచారం నిర్వహి ంచారు. రంగంపేట మండలంలో పలు గ్రామాలలో రాజమహేం ద్రవరం ఎంపీ అభ్యర్థిని పురందేశ్వరి తనయుడు హితేష్‌తో కలిసి రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి గ్రామాల్లో విశేష ఆదరణ లభించింది. ప్రతిచోటా హారతులు పడుతూ మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా వారి ఇబ్బందులు తీర్చే నాధుడే లేకుండా పోయాడని అనపర్తి నియోజకవర్గంలో కేవలం ఆర్చ్‌ల నిర్మాణాలతోనే సరిపె డుతూ అదే అభివృద్ధిగా చూపే నాయకులు ఉన్నారని, ప్రశ్నించిన గొంతులపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షసపాలన సాగించారని త్వరలోనే ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు.

పెద్డాడలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

పెదపూడి మండలం పెద్దాడలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పల్లపాటి వెంకన్న, అప్పారావు, పల్లపాటి ఎర్రోడు, పైడిమళ్ళ రామకృష్ణ, పి మోహన్‌ తదితరులు తమ అనుచరులతో ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆద్వర్యంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి బొడ్డు పార్టీలోకి ఆహ్వానించారు.

పెద్దాడలో మనోజ్‌, పెడపర్తిలో సనాతని, పీరా రామచంద్రపురంలో మహాలక్ష్మి ప్రచారం

పెదపూడి మండలం పెద్దాడలో ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి తనయుడు మనోజ్‌రెడ్డి, అనపర్తి మండలం పెడపర్తిలో నల్లమిల్లి కుమార్తె డాక్టర్‌ సనాతని, పీరా రామచంద్రపురంలో నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి ఇంటింట ప్రచారం నిర్వహించారు. వీరు గ్రామాలలో పర్యటిస్తూ రెండు ఓట్లను కమలం గుర్తుపై వేసి అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లిని పార్లమెంట్‌ అభ్యర్థిని పురందేశ్వరిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.

భరత్‌ రామ్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం

ఆవభూముల స్కాం, 25శాతం కమిషన్‌, భోగస్‌ పట్టాలు

అసలు వైసీపీ పాలనంతా అవినీతిమయమే

కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 8 : రాజమహేంద్రవరం లో భరత్‌రామ్‌ను ప్రజలంతా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలోని స్థానిక 6, 21, 22, 23, 24, 25, 29, 30, 31, 32, 33 డివిజన్లలో ఆయన, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌ , జనసేన నగర అధ్యక్షుడు వై.శ్రీను, మాజీ కార్పొరేటర్లు డివిజన్‌ ఇంచార్జీలతో కలసి రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో కార్యకర్తలు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది, మహిళలు, హారతలు ఇచ్చి పూలవర్షంతో స్వాగతించారు. ఈ ప్రజలందరికీ ప్రచార వాహనం పైనుంచి నమస్కరిస్తూ ముందుకుసాగారు. పలు ప్రాంతాలలో ప్రజలను ఉదేఽ్ధశించి మాట్లాడారు. ఐదేళ్లలో ఎంపీ భరత్‌రామ్‌ చేసిందేమిటని ప్రశ్నిస్తే ఆవ భూముల స్కాంతో కోట్లు దిగమింగాడని, నగరంలో అభి వృద్ధి పనులు అని చెప్పి అనాలోచితంగా పనులు చేసి ఆ యా పనులలో 25 శాతం కమిషన్‌ నొక్కేసారని చెప్పారు. ఈ పనుల సత్తా నిన్న పడిన గంటవర్షానికే ప్రజలకు పూ ర్తిగా అర్థమైందన్నారు. ఇళ్లలోకి నీరువెళ్లి విలువైన సామా న్లు పాడైపోయాయని, పరిసరాలు దుర్గధంగా మారి చా లా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. నగరంలో ప్రజలకు ఇళ్ల స్థలాల పేరుతో ఎన్నికల కోడ్‌కు ఒకరోజు ముందు ఆగమేఘాలపై భూమిలేని స్థలానికి ఎందుకూ పనికిరాని 25వేల బోగస్‌ పట్టాలను ఇచ్చి ప్రజలను మోసం చేశాడన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఏదైన పనులు చేపట్టేటప్పుడు ఆలోచించి ప్రణాళికలువేసి, సలహాలు సూచనలు తీసుకుని చేయాలని కాని అంతా నాఇష్టం నా కు నచ్చినట్టే జరగాలని నగరాన్ని నాశనం చేశాడన్నారు. అవినీతి పరుడైన ఈ రీల్స్‌ స్టార్‌ ప్రజలు ఓడిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా అవినీతిమయమైందన్నారు. ఇసుక, మట్టి, మధ్యం మాటును వేలకోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అన్నివ్యవస్థలను జగన్‌ బ్రష్టు పట్టించాడన్నారు. పన్నుపోటు, అధిక ధరలు, నిరుద్యోగం, కార్పొరేషన్ల నిర్వీర్యం, విద్యుత్‌చార్జీలు పెంపు, నిత్యావసరాల ధరల పెంపు, పోలవరాన్ని పూర్తి చేయకపోవడం, మూడు రాజధానుల పేరుతో నాటకాలు, పేదవారికి పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారన్నారు. సైౖకిల్‌ గుర్తుపై ఓటువేసి తనను ఎమ్మెల్యేగాను, కమలం గుర్తుపై ఓటువేసి దగ్గుబాటి పురందేశ్వరిని ఎంపీగాను గెలిపించాలన్నారు.

రోడ్‌ షో సాగిందిలా

కూటమి అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రోడ్‌ షోకు విశేషస్పందన లభించింది. ఉదయం 9గంటలకు స్థానిక 25వ డివిజన్‌ భరత్‌ బొమ్మలు నుంచి ప్రారంభమై టౌన్‌ హాలురోడ్డు గాంధీ విగ్రహాం వరకు సాగింది. అటుపై ప్రజలతో మాట్లాడాక అక్కడ నుంచి అజంతా హోటల్‌ రోడ్డు చేరుకుంది. అక్కడి నుంచి గోదావరి బండ్‌ రోడ్డులోని రామ్‌సా యి ఫైనాన్స్‌ కార్యాలయం రోడ్డుకు అటుపై మధ్యాహ్నం 1:30కు కంబం సత్రం రోడ్డుకు చేరుకుంది దారిపోవడవునా ప్రజలకు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అభివాదం చేస్తూ గెలిపించాలని కోరూతు ముందుకు సాగారు. అనంతరం సాయంత్రం 4గంటలకు 29వ డివిజన్‌లో అన్నపూర్ణంపేట సోమలమ్మ ఆలయం వద్దనుంచి రోడ్‌షో ప్రారంభమై రైల్వేగేట్‌ మీదుగా ఆశోక ధియేటర్‌ సెంటర్‌, ఆజాద్‌చౌక్‌కు చేరుకుంది. అక్కడి నుంచి లక్ష్మివారపుపేట చేరుకుని ఆ ప్రాంతంలో రోడ్‌ షో నిర్వహించారు. ఇన్న మూరి దీపు, మాటూరి సిద్ధార్థ, శెట్టి జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ అవినీతి కోటను బద్దలుకొడతాం

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ

కోరుకొండ, మే8:రాష్ట్రంలోను, రాజానగరం నియోజకవర్గంలోను వైసీపీ అవినీతి కోటలను బద్దలకొట్టే సమయం ఆసన్నమైందని ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని, గ్రామాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి వస్తున్న ఆదరణ ఇందుకు నిదర్శనమని బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు,గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. వైసీపీ ఇతర పార్టీ నాయకుల నుంచి అనేక గ్రామాల నుంచి టీడీపీ, జనసేనలోకి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చి చేరారు. వీరందరికీ బలరామకృష్ణ జనసేన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

కోరుకొండలో జనసేనలోకి చేరికలు

కోరుకొండ వడ్డీపేటకు చెందిన బీసీ సోదరులు మహిళలు బుధవారంరాత్రి జనసేన వైసీపీని జనసేనలో చేరారు. వీరందరికీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువాలువేసి సాదరంగా ఆహ్వానించారు. వందల సంఖ్యలో మహిళలు యువత జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నమ్మించి మోసం చేశారంటూ పలువురు బీసీ సోదరులు బలరామకృష్ణకు తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఐదేళ్ల సంక్షేమం, అవినీతి, అరాచకపాలన అంతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి గ్రామంలోని 60నుంచి 70 శాతం కూటమి వైపే ఉందన్నారు. ఇటు బత్తుల బలరామకృష్ణ, అటు టీడీపీ ఇన్‌చార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో కోరుకొండ మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛంధంగా కూటమికి మద్దతు తెలిపారన్నారు. టీడీపీ నాయకులు మాతా సీతారాముడు, మాతా ప్రభు, కటకం చలం, వడ్డెర సంఘ నాయకులు పాల్గొన్నారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి

రాజానగరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కుమార్తె వందనాంబిక రాజానగరం మండలం హౌసింగ్‌ బోర్డుకాలనీలో కూటమి నాయకులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.అదే విధంగారాజమహేంద్రంపార్లమెంట్‌ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దగ్గుపాటిపురందేశ్వరికి కమలంగుర్తుపై ఓటు వేయాలన్నారు. నాసేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా కో ఆర్డినేటర్‌ బత్తుల వెంకటలక్ష్మి, తోట ప్రత్యూషదేవి,తోట పవన్‌కుమార్‌, బత్తుల గోపాలకృష్ణ, తోటరాజు, కూటమి నాయకులతో కలిసి పలు గ్రామాల్లో ఇంటికి వెళ్లి నమూనా బ్యాలెట్‌ప్రాంతాలను అందించి గాజుగ్లాసు, కమలంగుర్తుకు ఓటు వేసి బలరామకృష్ణను, పురందేశ్వరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

వైసీపీ పాలనలో సంక్షేమం కుంటుపడింది

టీడీపీ, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

కడియం/రాజమహేంద్రవరంరూరల్‌, మే 8: వైసీపీ పాలనలో ఆంధ్రరాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడిందని, అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. రూరల్‌ మండలం కొంతమూరులో గ్రామకమిటీ అధ్యక్షుడు దండమూడి ప్రసాద్‌ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన బీజేపీ శ్రేణులు కలిపి గ్రామంలో జంగాలకాలనీ, కళ్యాణ్‌నగర్‌, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగన్‌రెడ్డి కబంద హస్తాలలో నలిగిపోతున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే, సంక్షేమం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబునాయుడును సీఎం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న తనకు తెలుగుదేశం-సైకిల్‌ గుర్తుపైనా, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ - కమలం గుర్తుపైనా ఓటేసి విజయం చేకూర్చాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దండమూడి ప్రసాద్‌, మత్యేటి ప్రసాద్‌, మార్ని వాసు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, దంటు విష్ణుమూర్తి, బొప్పన నానాజీ, కురుకూరి కిషోర్‌, దుద్దుపూడి రమేష్‌, ఉండవిల్లి బంగార్రాజు, గోక శ్రీను, బేసే నటరాజు, దండమూడి శ్రీహరి, సలీమ్‌, ఖాసిం, సయ్యద్‌ ఉమర్‌, వేమగిరి రాజు, యామన చిన్న, ఆకుమూరి అప్పన్న, అంగర రాజు, ఉల్లింగల శివ పాల్గొన్నారు.

అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం : గోరంట్ల కుమార్తె శిరీష

అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, సుపరిపాలన కావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కుమార్తె కంఠమనేని శిరీష కడియంలోని భాస్కరనగర్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్‌, మండల అధ్యక్షుడు వెలుగుబంటి నాని, జనసేన నాయకులు చిలుకూరి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, ముత్తాబత్తుల విజయకుమారి సారథ్యంలో కంఠమనేని శిరీష ప్రచారం నిర్వహి ంచారు. జల్ది కృపారావు, వనుం సూరిబాబు, కింగ్‌మోజెస్‌, తామెళ్ళ అయ్యప్ప, కనికెళ్ల బుల్లియ్య, పోలిశెట్టి శేఖర్‌, రత్నరాజు, మోసిగంటి సత్యవతి, కె రత్నకుమారి, గవరమ్మ, కాకిలేటి సత్యవతి, జనసేననాయకులు ఉండమట్ల ప్రభాకర్‌, అడబాల రాజు, సంజీవ్‌, పవన్‌, మర్రి శంకర్‌, చల్ల అంజిబాబు, షేక్‌ అమీనా, అరుణచౌదరి, ప్రసాద్‌, నాగరాజు, పాల్గొన్నారు.

ధవళేశ్వరం: కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, పార్లమెంట్‌ అభ్యర్థిగా పురందేశ్వరికి ఓట్లువేసి గెలిపించాలని కోరుతూ టీడీపీ నాయకులు గ్రామంలో పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈవీఎంలో మూడోస్థానంలో సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ నమూనా ఈవీఎంలతో ఓటువేసే విధానం వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

Updated Date - May 09 , 2024 | 01:41 AM