Share News

అదే ఉధృతి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:35 AM

అఖండ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండు మూడు రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండవచ్చని అధికారులు చెబుతు న్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 13.60 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి 12,52,949 క్యూసెక్కుల నీరు సముద్రం లోకి పోతోంది.

అదే ఉధృతి
కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

  • స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

  • ఇప్పటికే 743 టీఎంసీల సముద్రం పాలు

  • రాత్రి 7 గంటలకు బ్యారేజీ నుంచి 12,52,949 క్యూసెక్కులు సముద్రంలోకి

  • నష్టం అంచనాలకు కమిటీలు నియమించిన జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అఖండ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండు మూడు రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండవచ్చని అధికారులు చెబుతు న్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 13.60 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి 12,52,949 క్యూసెక్కుల నీరు సముద్రం లోకి పోతోంది. భద్రాచలం వద్ద 47.70 అడుగులుగా ఉంది. ఎగువ భాగంలో వాతావరణం మేఘావృతంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు లేవు. కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల మూడురోజులపాటు ఓ మో స్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరిక చేశారు. ఈనెల 19వ తేదీకి ధవళేశ్వరం వద్ద సుమారు 3.6 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి పోతుండగా,. అప్పటి నుంచి వరద పెరుగుతూ ఉండడంతో 22వ తేదీ ఉద యం ఏడు గంటలకు మొదటి హెచ్చరిక జారీచేశారు. తర్వాత రెండో ప్రమా ద హెచ్చరిక జారీకావడం, కాస్త వరద తగ్గడంతో దాన్ని ఉపసంహరించు కున్నారు. కానీ మళ్లీ వరద పెరగడంతో ప్రస్తుతం భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అంతేకాక ఇక్కడ నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది. వరద ఉధృతి స్పల్పంగానే పెరుగుతున్నా గోదావరి ఉగ్రరూపంలోనే ఉంది. పోలవరం స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద సముద్రాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరి తీవ్రరూపం దా ల్చింది. గోదావరి స్నాన ఘట్టాలలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. పునరా వాస కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద డ్రైన్‌ స్లూయిజ్‌ను గోదావరి వరద ఎగదన్నడంతోపాటు రాజమహేంద్ర వరంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగి వీధులను ముంచెత్తాయి.

  • నష్టాలు అంచనాలకు కమిటీలు నియమించిన కలెక్టర్‌

జిల్లాలో ఇటీవల భారీగా కురిసిన వర్షాలు, వరదలతోపాటు బురదకాలువ, జెల్లకాలువ, కొవ్వాడ, ఎర్రకాలువ వంటివి ఉప్పొంగడంతో జరిగిన నష్టాలను తక్షణం లెక్కించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత శాఖల అధికారు లను ఆదేశించారు. జిల్లాలో 119 ఇళ్లకు నష్టం జరిగిన ప్రాఽథమిక అంచనారా గా, రెవెన్యూ, హౌసింగ్‌ ఏఈ, ఎంపీడీవోలతో ఒక కమిటీని వేసి ఒక్కరోజు లోనే నష్టాల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయశాఖకు సంబంధించి గ్రామ, మండల స్థాయిలలో కమిటీలు వేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాల న్నారు. మిగిలిన శాఖలలో జరిగిన నష్టాల గురించి కూడా ఎన్యుమరేషన్‌ వెంటనే జరగాలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరద, భారీ వర్షాల వల్ల బాధితులుగా ఉన్నవారికి తక్షణం రూ.3 వేల వం తున సహాయం చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. జిల్లా స్థాయిలో కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఎర్రకాలువ బాధితులకు పునరావాస కేం ద్రాలు ఏర్పాటుచేశారు. వరద బాధితులకు యంత్రాంగం అండగా నిలిచింది.

  • ఏటిగట్లు బలహీనం

సీతానగరం, జూలై 26 : గోదావరి మళ్లీ పెరుగుతుండడంతో తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీతానగరం మండలంలోని లంక గ్రామమైన ములకల్లంక వెళ్లడానికి ప్రజలు మరబోట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే లైఫ్‌ జాకెట్లు వినియోగించడం లేదు. లంక గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. గోదావరి పరవళ్లు తొక్కుతుండడంతో బొబ్బిల్లంక స్లూయిజ్‌ నుంచి మండలంలోని మురుగు కాలువ నీరు గోదావరిలో కలిసే అవకాశం లేకపోవడంతో పంట భూములు ఇంకా నీటిలోనే ఉన్నాయి. బొబ్బిల్లంక వద్ద ఏటిగట్టు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బొబ్బిల్లంక అంబేడ్కర్‌ బొమ్మ వద్ద, అశోక్‌ నగర్‌ వద్ద ఏటిగట్టు బలహీనంగా ఉందని, గోదావరి ఇంకా పెరిగితే ఏటిగట్టు ప్రమాదంలో పడుతుందని గ్రామస్తులు అంటున్నారు. గోదావరి లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌ ఏఈ శివప్రసాద్‌ ఏటిగట్టును శుక్రవారం పరిశీలించి ఆయన మాట్లాడుతూ ఏటిగట్టుకు గండ్లు పడకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

  • పెరుగుతోంది..

కొవ్వూరు, జూలై 26 : గత వారం రోజులుగా గోదావరి వరద తగ్గుతూ, పెరుగుతూ దోబూచులాడుతోంది. అఖండ గోదావరి మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న బారీ వర్షాలకు వరద ప్రవాహం భారీగా నదిలో వచ్చి చేరుతోంది. దీంతో గోదారమ్మ పొటెత్తి నిండుకుండలా పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం అధికంగా వచ్చి నదిలో చేరడంతో వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఏజీఆర్‌బీ అధికారులు చెబుతున్నారు. దిగువన ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు పెరిగి నెమ్మదిగా తగ్గుముఖం పట్టవచ్చని కొవ్వూరు అఖండ గోదావరి కుడిగట్టు విభాగం ఏఈ ఆర్‌ సునీల్‌బాబు తెలిపారు. కాగా గత వారం రోజులుగా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాలు వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో నదిలోకి ఎవరు వెళ్లకుండా అధికార పార్టీ యంత్రాంగం చర్యలు చేపట్టింది. విజ్జేశ్వరం నుంచి పోలవరం దాకా ఏటిగట్లను పరిశీలించామని ప్రస్తు తం ఎటువంటి ప్రమాదం లేదని, ముందస్తు చర్యలు కూడా చేపట్టి నట్టు సునీల్‌బాబు తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 01:35 AM