Share News

సత్యదేవుడి విమానగోపురం స్వర్ణమయానికి కొలతలు తీసిన టీటీడీ బృందం

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:48 AM

రత్నగిరివాసుడైన సత్యదేవుడి విమానగోపురం స్వర్ణమయం చేసేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం దేవదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప నేత్రుత్వంలో ఒక కమిటీ పరిశీలన జరిపి సుమారు 11కేజీల బంగారం పడుతుందని అంచనా వేయగా దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలతో శుక్రవారం టీటీడీ డిప్యూటీ ఈఈ చంద్రమౌళీరెడ్డి, అసిస్టెంట్‌ స్థపతి మురళీశంకర్‌, అప్రయిజర్‌ నాగరాజు, సూపరింటెండెంట్‌ మనోహర్‌ల బృందం విమానగోపురం కొలతలను తీసుకున్నారు.

సత్యదేవుడి విమానగోపురం స్వర్ణమయానికి  కొలతలు తీసిన టీటీడీ బృందం

అంచనా వ్యయం రూ.10కోట్లకు పెరిగే అవకాశం

అన్నవరం, జూలై 26: రత్నగిరివాసుడైన సత్యదేవుడి విమానగోపురం స్వర్ణమయం చేసేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం దేవదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప నేత్రుత్వంలో ఒక కమిటీ పరిశీలన జరిపి సుమారు 11కేజీల బంగారం పడుతుందని అంచనా వేయగా దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలతో శుక్రవారం టీటీడీ డిప్యూటీ ఈఈ చంద్రమౌళీరెడ్డి, అసిస్టెంట్‌ స్థపతి మురళీశంకర్‌, అప్రయిజర్‌ నాగరాజు, సూపరింటెండెంట్‌ మనోహర్‌ల బృందం విమానగోపురం కొలతలను తీసుకున్నారు. విమానగోపురంపై దేవతామూర్తుల విగ్రహాలు ఉండడంతో ప్రతీ అంగుళం కొలతలు తీసుకున్నారు. 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు ఈ ఆలయశిఖరంపై సుమారు 50 దేవతామూర్తులు విగ్రహాలున్నాయి. అప్పటి అంచనా ప్రకారం సుమారు 7.5 కోట్లు కాగా, ప్రస్తుతం ధరలు అప్పటితో పోల్చితే పెరగడం, దేవతామూర్తుల విగ్రహాలు కొలతలు ప్రాథమికంగానే తీసుకోవడంతో అంచనా వ్యయం సుమారు రూ.10 కోట్లకు చేరుతుందన్నారు. దీనిపై దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌తో చర్చించి నివేదకను దేవదాయకమిషనర్‌కు అందజేస్తామని బృందసభ్యులు తెలిపారు. ఈనెల 30న అంచనా వ్యయం రిపోర్టు అందజేయ నున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ నరసింహారెడ్డి తదితరులున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:48 AM