Share News

AP Elections: నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం.. పోలీసులపై ఈసీ ఫైర్

ABN , Publish Date - May 12 , 2024 | 03:44 PM

నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి ఇంటికి హీరో అల్లు అర్జున్ నిన్న (శనివారం) వచ్చారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు, అల్లు అర్జున్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్, శిల్ప రవిపై కేసు నమోదు చేశారు.

AP Elections: నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం.. పోలీసులపై ఈసీ ఫైర్
allu arjun

అమరావతి: నంద్యాల పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి ఇంటికి హీరో అల్లు అర్జున్ నిన్న (శనివారం) వచ్చారు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్, శిల్ప రవిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఉన్న జనాన్ని ఆధారాలతో సహా అందజేశారు.


పోలీసుల తీరుపై ఆగ్రహం

ఆ ఫుటేజీ చూసిన కేంద్ర ఎన్నికల సంఘం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి వద్ద ఇంత జనం ఉండటం ఏంటి అని మండి పడింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, నంద్యాల టూటౌన్ సీఐ రాజారెడ్డిలపై ఛార్జిషీటు ఓపెన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. బాధ్యులైన పోలీసులపై శాఖాపరంగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించి 60 రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని కోరింది. తమ అనుమతి లేకుండా కేసు కొట్టి వేయొద్దని పోలీసు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పింది.


ఏం జరిగిందంటే..?

సెలబ్రిటీలు ప్రచారం కోసం వచ్చిన సమయంలో అధికారుల నుంచి కచ్చితంగా సమాచారం ఇవ్వాలి. శిల్ప రవిచంద్ర కిశోర్ సమాచారం ఇవ్వలేదు. ఆ అంశాన్ని ఫ్లైయింగ్ స్వ్కాడ్ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కేసు ఫైల్ చేశారు. నంద్యాల టూ టౌన్ పోలీసులు అల్లు అర్జున్, శిల్ప రవిపై కేసు నమోదు చేశారు. మాములు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటారా అని ఈసీ మండిపడింది. దీంతో అల్లు అర్జున్, శిల్ప రవికి చిక్కులు తప్పేలా లేవనిపిస్తోంది.


Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 03:44 PM