AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..
ABN , Publish Date - May 12 , 2024 | 02:49 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఓటు వేయనున్నారు.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు(సోమవారం) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఓటు వేయనున్నారు.
AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!
ఉండవల్లిలోని గాదె రామయ్య - సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల చుట్టుపక్కల పరిసరా ప్రాంతాల్లో ఎన్నికల సంఘం పట్టిష్ట భద్రత చర్యలు చేపట్టింది.
ఏపీలో ఏలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు నిరంతరం ఎన్నికల సరళి పకడ్బందీగా జరిగేలా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. కాగా.. దేశంలో 2024 లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు(lok sabha 2024 elections) సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని 96 ఎంపీ స్థానాల కోసం పోలింగ్ జరుగనుంది.
Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..
Read Latest AP News And Telugu News