Share News

AP DGP Transfer: జగన్‌కు బిగ్ షాక్.. డీజీపీపై ఈసీ వేటు..

ABN , Publish Date - May 05 , 2024 | 06:15 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని సూచించింది.

AP DGP Transfer: జగన్‌కు బిగ్ షాక్.. డీజీపీపై ఈసీ వేటు..
DGP Rajendranath Reddy

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఆయన కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని ప్రభుత్వానికి సూచించింది.


కాగా, ఎన్నికల్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. ఇదే విషయమై ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించింది.


విపక్షాల రియాక్షన్స్..

కాగా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పదవికి అనర్హుడని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని.. జగన్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చాక డీజీపీ ఒక్కసారి అయినా ప్రెస్ మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నమ్మకం కలిగించలేకపోయారని విమర్శించారు. సీఎం జగన్ సేవలో తరించడమే డీజీపీ డ్యూటీగా మారిపోయిందన్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 05 , 2024 | 06:26 PM