Share News

MLA Pinnelli: వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?

ABN , Publish Date - May 22 , 2024 | 02:58 PM

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

MLA Pinnelli: వెంటాడుతున్న పోలీసులు.. పిన్నెల్లి  బ్రదర్స్ ప్లాన్ ఇదేనా..?

అమరావతి, ఆంధ్రజ్యోతి మే-22: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో.. తక్కువలో తక్కువ 3 సెక్షన్‌ల కింద 2 సంవత్సరాలు, ఒక సెక్షన్ కింద 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి. ఇవన్నీ తప్పించుకోవడానికి మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లాలని మొదట యత్నించిన పిన్నెల్లి బ్రదర్స్.. పోలీసులు వెంబడించడంతో ఇక చేసేదేమీ లేక విదేశాలకు పారిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాను మించిన ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్న పరిస్థితి.


ప్లాన్ ఇదేనా..?

పారిపోతున్న పిన్నెల్లి బ్రదర్స్‌ను పోలీసులు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అన్ని ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు.. బస్ స్టేషన్లలో అలర్ట్ చేశారు. అయితే.. ఫోన్లు, వీసాలు కూడా వారి దగ్గర లేవని.. దీంతో వీసాలు అక్కర్లేని దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం వెళ్లింది. బీదర్ నుంచి మహారాష్ట్రలో ప్రవేశించి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఖాకీలకు పక్కా సమాచారం అందింది. బీదర్ వైపునకు ఏపీ, తెలంగాణ టీమ్స్‌ను వెళ్ళాలని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. మరోవైపు.. ప్రత్యేక బృందాలకు ఎప్పటికప్పుడు పల్నాడు ఉన్నతాధికారులు సమాచారం ఇస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు అరెస్ట్ చేయాలని పట్టుదలతో పోలీసులు ఉన్నారు. మాచర్లలోనే పోలీసు ఉన్నతాధికారులు మకాం వేశారు. పిన్నెల్లి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి


పోలింగ్ బూత్‌లో ‘పిన్నెల్లి’ విధ్వంసకాండపై ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు


పిన్నెల్లి విధ్వంసం.. సీఈఓపై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 లోపు..!


ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!


వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు


Updated Date - May 22 , 2024 | 03:04 PM