Share News

CEO MK Meena: 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్

ABN , Publish Date - May 12 , 2024 | 07:14 AM

ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

CEO MK Meena: 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్

అమరావతి: ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓ),అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఎపిఓ) ఇతర పోలింగ్ సిబ్బంది (ఒపిఓ)కి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) వర్తించనుంది .

Chandrababu : మీ భూమి.. మీ హక్కు!


పోలింగ్ విధుల్లో భాగంగా రిజర్వుడు సిబ్బందిగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిగా డ్రాప్టు చేయబడిన వారికి ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తించదని ఎంకే మీనా వెల్లడించారు. వాస్తవంగా ఎవరైతే పోలింగ్ విధులు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తిస్తుందని తెలిపారు. అందరు జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఆదేశాలను రిటర్నింగ్ అధికారులందరికీ తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. 13న పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని అప్పగించిన తర్వాత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతుందన్నారు. 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి) సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అందరు కార్యదర్శులు,శాఖాధిపతులు, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలకు ఈ ఆదేశాలను సర్క్యులేట్ చేయాలని ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి..

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read more AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 07:14 AM