Share News

Chandrababu: వైసీపీ దుర్మార్గపు పాలనను తరిమికొట్టాలి.. సీఎం జగన్‌‌పై చంద్రబాబు ఆగ్రహం

ABN , Publish Date - Apr 20 , 2024 | 06:16 PM

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి (Minister Kakani Govarthan Reddy) కనీసం తన నియోజకవర్గానికైనా న్యాయం చేశారా? అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఇలాంటి వారు మంత్రులు కాబట్టే ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని అన్నారు. శనివారం నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Chandrababu: వైసీపీ దుర్మార్గపు పాలనను తరిమికొట్టాలి.. సీఎం జగన్‌‌పై చంద్రబాబు ఆగ్రహం
Chandrababu

నెల్లూరు: మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి (Minister Kakani Govarthan Reddy) కనీసం తన నియోజకవర్గానికైనా న్యాయం చేశారా? అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. ఇలాంటి వారు మంత్రులు కాబట్టే ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని అన్నారు. శనివారం నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ని కాకాణి గోవర్థన్‌రెడ్డి తరిమేశారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.


AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్‌

దీంతో పదివేల మందికి ఉపాధి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చెరువులు, గుట్టలు, కొండలు ఏదీ వదల్లేదని మండిపడ్డారు. సిలికాలో రూ.4500కోట్లు, క్వార్ట్జ్‌లో రూ.4000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాడి బక్కచిక్కిపోయారని.. అక్రమ సొమ్ముతో కాకాణి బలిసిపోయారని విమర్శించారు.


AP Elections: మంత్రి కాకాణి ఇలాకాలో భారీగా మద్యం డంప్... అధికారులు వెళ్లి చూడగా..!

ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓటుకి రూ.10వేలు ఇవ్వడానికి వస్తున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మీ ముందుకు వచ్చారని చెప్పారు. సోమిరెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపించి వైసీపీ దుర్మార్గపు పాలనను పాతిపెడతారా? లేదా? అని ప్రశ్నించారు. పలు సర్వేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని చెప్పాయన్నారు. కాకాణికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు.


ప్రజల కోసం అనేక సంక్షేమ‌ పథకాలు చేపట్టానని తెలిపారు. మీ పిల్లలని చదివించుకోవాలంటే ఈ ప్రభుత్వం స్కాలర్ షిప్పులు ఇస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న డబ్బంతా ఎక్కడికి పోయిందంటే, తాడేపల్లి కొంపకి పోయిందా లేదా? అని నిలదీశారు.

ట్రాక్టర్ ఇసుక గతంలో రూ.వెయ్యి.. ఇప్పుడెంత రూ.5వేలు అయిందన్నారు. మిగిలిన డబ్బంతా జగన్ దగ్గరే ఉందని చెప్పారు. ఆయన వేసే ఎంగిళి మెతుకులతో మనమంతా బతకాలా అని ప్రశ్నించారు. తాను ప్రజలే రాజులు కావాలని అనుకుంటానని.. ప్రతి పేదవాడిని ఆర్ధికంగా ముందు తీసుకెళ్తానని వివరించారు.


తన హయాంలో నెల్లూరులో 46వేల టిడ్కో ఇళ్లు కట్టానని స్పష్టం చేశారు. ఆ ఇళ్లకి రంగులేసుకుని, ఒక్క ఇళ్లయినా పేదలకు ఈ సైకో జగన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని 9 సార్లు పెంచారని మండిపడ్డారు. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు. రూ.1.5లకే యూనిట్ కరెంట్ ఇస్తానని మాటిచ్చారు.

జగన్ శవరాజకీయాలు చేశాడా? లేదా? అని ప్రశ్నించారు. వృద్ధులని ఎండలో తిప్పి, కొందరి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మొన్నేమో కోడికత్తి డ్రామా... ఇప్పుడేమో గులకరాయి... ఆ గులకరాయితో డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ ఈ దాడిని తానే చేయించానని వైసీపీ నేతలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాకాణి కోర్టులో ఫైళ్లు దొంగిలించారని ఆరోపించారు.


ఈ దొంగ గతంలో గోవా నకిలీ మద్యం పంపిణీ చేశారని విమర్శించారు. ఆ కేసు ఇంకా కోర్టుల్లో నడుస్తోందని.. ఏదీ వదలబోనని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడేమో పంటపాళెంలో మంత్రి కాకణి గోవర్థన్‌రెడ్డిది పోలీసులు ఒక మద్యం డంప్ పట్టుకున్నారని చెప్పారు. జగన్ ఇచ్చేది నకిలీ నవరత్నాలని విమర్శించారు. టీడీపీ ఇచ్చేది సూపర్ సిక్స్ అని తెలిపారు.

అందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు. రైతులని ఆర్థికంగా ఆదుకుంటానని... రైతులని రాజులని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఈ కూటమి అవసరమని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అని కొనియాడారు. ఏపీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పారు.


ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలితే దుర్మార్గులకి అవకాశం వస్తుందని, అందుకే మనతో కలిసి పవన్ వచ్చారని తెలిపారు. ముస్లింలు ఆలోచించాలని ఈ దుర్మార్గపు జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు తమతో కలిసి రావాలని కోరారు. గతంలో ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు ముస్లింలకి ఏ అన్యాయమైనా జరిగిందా? అని ప్రశ్నించారు.

కర్నూలులో ఉర్ధూ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నో మైనార్టీల కోసం పలు పథకాలు అమలు చేశానని గుర్తుచేశారు. రేపు జగన్ గెలిస్తే తన కేసుల కోసం ఎవరితో కలుస్తారో ఆలోచించాలన్నారు. తల్లిని చూడని వాడు, చెల్లికి అన్యాయం చేసినోడు, మనకేం న్యాయం చేస్తాడో ఆలోచించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి నేతలు విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు.


ఇవి కూడా చదవండి

Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!

Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 06:49 PM