AP Elections: పదే పదే కోడ్ ఉల్లంఘన.. వైసీపీ అభ్యర్థులపై ఈసీ కన్నెర్ర
ABN , Publish Date - Mar 21 , 2024 | 09:40 AM
Andhrapradesh: అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తూ వైసీపీ నేతలు బరితెగింపులకు పాల్పడుతున్నారు. అలాగే వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేకాతరు చేస్తూ కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈక్రమంలో వైసీపీ, వాలంటీర్ల ఆగడాలపై కన్నెర్ర చేసిన ఎన్నికల కమిషన్.. కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, వాలంటీర్లపై కేసులు నమోదు చేస్తున్నారు.
కడప, మార్చి 21: అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు (YSRCP) ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తూ వైసీపీ నేతలు బరితెగింపులకు పాల్పడుతున్నారు. అలాగే వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేకాతరు చేస్తూ కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ, వాలంటీర్ల ఆగడాలపై కన్నెర్ర చేసిన ఎన్నికల కమిషన్ (Election Commission).. కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది.
YS Sharmila: నేడు కడప నేతలతో షర్మిల భేటీ.. పోటీపై ప్రకటన..!
ఇందులో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, వాలంటీర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వాలంటీర్లపై వేటు వేస్తూ విధుల నుంచి తొలగిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో (YSRCP MLA Candidate Rachamallu Shivaprasad Reddy) పాటు వైసీపీ నేతలు, వాలంటీర్లపై కేసులు నమోదు అయ్యాయి. కడప జిల్లాలో వైసీపీ అభ్యర్ధులు విచ్చలవిడిగాఎన్నికల కోడ్‌ను ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో అధికార పార్టీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒకేరోజు ఏకంగా 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
TG Politics: కాంగ్రెస్ మలి జాబితాపై ఉత్కంఠ!
రాచమల్లుపై మరో కేసు
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది. ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాచమల్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 19న వైసీపీ మహిళా కౌన్సిలర్ వెంకట లక్ష్మీని ఇంటికెళ్లి మరీ ఎమ్మెల్యే రాచమల్లు బదిరించినట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారానికి రాకపోవడంతో మహిళా కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు నుంచి ప్రాణహాని ఉందని ఫిబ్రవరి 21న ఎస్పీకి, ఎన్నికల కమిషన్‌కు కౌన్సిలర్ దంపతులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
Nara Family: దేవాన్ష్ పుట్టిన రోజు.. శ్రీవారి ఆశీస్సులు పొందిన నారా కుటుంబం
Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..