Share News

Kesineni Chinni: ప్రభుత్వ వ్యతిరేక ఓటు రూపంలోనే భారీ ఎత్తున పోలింగ్

ABN , Publish Date - May 14 , 2024 | 12:01 PM

ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఎక్కువగా కూటమికే అవకాశాలు ఉన్నాయని.. పెద్ద ఎత్తున పోలింగ్ జరగడమే దీనికి సంకేతమని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవనం చేసుకుంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నేడు తెలిపారు.

Kesineni Chinni: ప్రభుత్వ వ్యతిరేక ఓటు రూపంలోనే భారీ ఎత్తున పోలింగ్

అమరావతి: ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఎక్కువగా కూటమికే అవకాశాలు ఉన్నాయని.. పెద్ద ఎత్తున పోలింగ్ జరగడమే దీనికి సంకేతమని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవనం చేసుకుంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని (Kesineni Chinni) నేడు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ లాంటి అర్భన్ ప్రాంతంలో 82శాతం పోలింగ్ నమోదు కావడం తమ విజయనికి సంకేతమన్నారు.

Pawan Kalyan: ఏపీలో కాలువల నిర్వహణపై పవన్ కామెంట్స్


ప్రభుత్వ వ్యతిరేక ఓటు రూపంలోనే భారీ ఎత్తున పోలింగ్ నమోదైందన్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు పోటెత్తి కసితో ఓటేశారన్నారు. విజయవాడ పార్లమెంటులో గత రెండున్నరేళ్లుగా తన దృష్టికి అనేక సమస్యలు వచ్చాయన్నారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని చిన్ని తెలిపారు. ప్రజా జీవితంలోకి వచ్చిన మాకు రిలాక్సేషన్ ఉండదన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వడంతో కుటుంబ సభ్యులతో రెండు రోజులు రిలాక్స్ అయ్యి యథావిధిగా తిరిగి ప్రజాజీవితంలో మమేకం అవుతామని కేశినేని చిన్ని తెలిపారు.

ఇవి కూడా చదవండి...

YCP Mla: పోలింగ్ కేంద్రంలో రూల్స్ బ్రేక్.. ఏం చేశారంటే..?

Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 12:01 PM