Share News

AP Elections 2024: జాబ్ క్యాలెండర్ పేరుతో నయ వంచన చేసిన జగన్ : నందమూరి బాలకృష్ణ

ABN , Publish Date - May 03 , 2024 | 09:12 PM

జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ (CM Jagan) నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. విశాఖ కంచరపాలెంలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్.. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి. విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP Elections 2024: జాబ్ క్యాలెండర్ పేరుతో నయ వంచన చేసిన జగన్ : నందమూరి బాలకృష్ణ
Nandamuri Balakrishna

విశాఖపట్నం: జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ (CM Jagan) నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. విశాఖ కంచరపాలెంలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్.. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి. విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు అభివృద్ధికి సూచిక అని తెలిపారు. ఉత్తరాంధ్ర గడ్డమీద అడుగుపెడితే చాలు పౌరుషం వస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజల గౌరవభిమానాలు అలా ఉంటాయని అన్నారు.


Chandrababu: ‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్, ఏ2 మీరే’.. పెన్షనర్ల కష్టాలపై చంద్రబాబు ఆగ్రహం

దేనికి సిద్ధం జగన్...

‘‘సిద్ధం సిద్ధం సిద్ధం అంటున్నావ్.. దేనికి సిద్ధం బాబాయిని చంపినందుకా.. తల్లిని, చెల్లిని బయటికి గెంటేసావ్.. బాబాయి చంపిన వాడిని వదిలేసావు.. నీ చెల్లికి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా..? జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి వారిని గంజాయి, డ్రగ్స్‌కి బానిసలు చేసావ్ వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా....? మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతులను నాశనం చేసి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా.....? పోలవరాన్ని గోదావరిలో కలిపేసినందుకు సిద్ధమా.....? పెంచిన పన్నులు తగ్గించేందుకు సిద్ధమా.....? కల్తీ మద్యంతో తాళిబొట్లు తెంచావు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా’’ అని బాలకృష్ణ ప్రశ్నించారు.


Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

ఆ యాక్ట్‌తో తస్మాత్ జాగ్రత్త...

పది రూపాయలు ఇచ్చి, మద్యం పదింతలు రేటు పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టిన ఘనత జగన్‌దని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తస్మాత్ జాగ్రత్త.. మీ ఆస్తులకి వాళ్ల బొమ్మలేంటి అని ప్రశ్నించారు. అరాచకం కావాలా సమర్థమైన పాలన కావాలా.. నిర్ణయించుకోవాలని సూచించారు. విధ్వంస రాక్షసుడిని ఎదురుకోవడానికి అందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డామని బాలకృష్ణ పేర్కొన్నారు.

AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 09:32 PM