Share News

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

ABN , Publish Date - Apr 23 , 2024 | 01:31 PM

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

విజయనగరం, ఏప్రిల్ 23: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. నగరంలోని గజపతినగరం సివిల్‌ జడ్జి కోర్టులో ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం జడ్జి ఎదుట అఫిడవిట్‌తో చంద్రబాబు ప్రమాణం చేశారు. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందంటే.. కుప్పం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న ఈ నానిమేషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే.. ఒకరి తరఫున మరొకరు నామినేషన్లు దాఖలు చేస్తే.. ఇలా జడ్జికి నామినేషన్ పత్రాలు సమర్పించి.. ప్రమాణం చేయాల్సి ఉంటుంది.. అందుకే భువనేశ్వరి నామినేషన్లు దాఖలు చేయగా.. చంద్రబాబు ఇప్పుడు ప్రమాణం చేశారు.


Gajapati-Nagaram-Court.jpg

అటు అఫిడవిట్ .. ఇటు చర్చలు!

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మరికొన్ని స్థానాల్లో మార్పులు, చేర్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చంద్రబాబు విజయనగరం పర్యటనకు రావడంతో రసవత్తరంగా రాజకీయం మారింది. తమకు టిక్కెట్లు రాలేదని అలకబూని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడుతో బాబు చర్చించారు. సుమారు అరగంటపాటు అసంతృప్తులతో జరిగిన ఈ చర్చలు ఫలించాయి. అనంతరం బొండపల్లిలో మహిళా సదస్సుకు కిమిడి, నాయుడు ఇద్దరూ హాజరయ్యారు.

CBN-Gajapathi-Nagaram.jpg

Read Latest National News and Telugu News.


Updated Date - Apr 23 , 2024 | 01:36 PM