Share News

AP Elections: ఏపీ సీఎస్‌ జవహర్‌ బదిలీ కానున్నారా..?

ABN , Publish Date - May 27 , 2024 | 08:51 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని (AP CS Jawahar Reddy) బదిలీ చేస్తారా..? త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) నుంచి కీలక ఆదేశాలు రాబోతున్నాయా..?..

AP Elections: ఏపీ సీఎస్‌ జవహర్‌ బదిలీ కానున్నారా..?

అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని (AP CS Jawahar Reddy) బదిలీ చేస్తారా..? త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) నుంచి కీలక ఆదేశాలు రాబోతున్నాయా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే జరిగేట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. సీఎస్‌గా నియమితులైంది మొదలుకుని ఇవాళ్టి వరకూ జవహర్‌పై లేని ఆరోపణలు లేవు. మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఈయన వ్యవహరించిన తీరుతో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఒకింత ఆశ్చర్యపోయిన పరిస్థితి. దీనికి తోడు సీఎస్‌పై ప్రతిపక్షాల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో విసిగివేసారిపోయిన ఈసీ.. జవహర్‌ను పక్కనెట్టే అవకాశాలు, అది కూడా అతి త్వరలోనే అని తెలుస్తోంది.

సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!



cec-jawahar.jpg

ఏం నడుస్తోంది..?

సీఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున హడావుడి నడుస్తోంది. జనసేన నేత మూర్తి యాదవ్ ఈ వ్యవహారాన్ని వెలుగులోనికి తీసుకురావడంతో ఒక్కసారిగా ఏపీలో బర్నింగ్ టాపిక్ అయ్యింది. సీఎస్ తన కుమారుడు, బినామీల పేరిట 800 ఎకరాల భూములు కొన్నారని తాజాగా టీడీపీ చేస్తున్న ఆరోపణ. అందుకే.. ఇక సీఎస్ ఆగడాలకు కళ్లెం వేసి.. బదిలీ చేయించాలని టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ లేఖ రాసింది. జవహర్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని లేఖలో టీడీపీ పేర్కొంది. వైజాగ్‌లో అసైన్ఢ్ భూములను తన కుమారుని పేరుపై రిజిస్టర్ చేయించుకున్నారని లేఖలో నిశితంగా వివరించారు తెలుగు తమ్ముళ్లు. రిజిస్ట్రేషన్ సమయంలో సీఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ఇంత చేసిన జవహర్ ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో కౌంటింగ్ స్వేచ్చాయుత, ప్రజాస్వామ్యయుతంగా జరగదని నమ్ముతున్నట్లు టీడీపీ నేతలు లేఖలో వివరించారు. సీఎస్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని సీఈసీకి రాసిన లేఖలో టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ వివరించారు.

నెక్స్ట్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా..?


jawahar-reddy.jpg

అంతకుమించి ఇలా..!

ఇదిలా ఉంటే.. ఎన్నికల సమయంలో ఈసీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే ఈసీ చెప్పినట్లు వినాల్సిందే.. ఇచ్చిన ఆదేశాలు అక్షరాలా పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ.. జవహర్ రెడ్డి తీరే వేరు. సీఎస్ అయినప్పటికీ నుంచి ఇప్పటికీ జగన్నామ స్మరణ చేస్తునే ఉన్నారు. గీత దాటి మరీ జగన్ భజన చేస్తున్న అక్రమార్కులను కాపాడినట్లు ఆరోపణలు కోకొల్లలు. మనోడు అయితే చాలు.. వైసీపీకి రాజకీయంగా పనికొస్తారని అనుకుంటే.. వాళ్లమీద ఈగ కూడా వాలనివ్వడంలేదని చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆదేశాలిచ్చింది ఈసీ అయినా, కేంద్రమైనా, రాష్ట్రంలో ఉన్న వైసీపీ బాస్ ఆదేశాలే తనకు శిరోధార్యమన్నట్లు ఏకపక్షంగా వ్యవహరించారని టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చి ఎన్నిసార్లు ఆరోపించారో లెక్కలేదు. ఇక తాజాగా చూస్తే.. ఏకంగా ఎన్నికల కమిషన్‌కే టీడీపీ లేఖ రాసింది. ఇన్ని ఆరోపణలు.. ఆయన చేష్టలతో కచ్చితంగా సీఎస్‌పై వేటు పడుతుందని టీడీపీ విశ్వసిస్తోంది.. ఏం జరుగుతుందో..? ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి మరి.

లీగల్ నోటిసులు పంపిస్తాం.. సీఎస్ కార్యాలయం ప్రకటన

Updated Date - May 27 , 2024 | 08:54 PM