AP Elections 2024: అవినాష్ రెడ్డి అమాయకుడంటే కడప ప్రజలను వంచించడమే:వర్లరామయ్య
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:30 PM
గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్‌రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి: గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్‌రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఐదేళ్లు ఎంపీగా పోటీచేసిన అవినాష్‌రెడ్డి ( MP Avinash Reddy) ఒక చిన్న బాలుడు అనడంలో సీఎం జగన్ ఔచిత్యమేమిటో..? మీ బాబాయిని గొడ్డలి వేటు వేసిన ఘటనలో సూత్రధారి ఎలా అమాయకుడు అవుతాడు..? అవినాష్‌రెడ్డిని అమాయకుడు అంటున్న నీపై కూడా 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి.. మీరు కూడా అమాయకులేనా’’ అని వర్లరామయ్య ప్రశ్నించారు.
Andhra Pradesh: పసుపు అడ్డాలో పట్టు ఎవరిదో?
ఆయన మోసాలు, అబద్ధాలను ఇక జనాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జగన్ ఇక డ్రామాలు ఆపాలని హితవు పలికారు. చట్టాన్ని గౌరవించి కోర్టులకు హాజరవుతే ఆయన బయట ఉండేవారో లోపన ఉండేవారో తేలిసిపోయేదన్నారు. అవినాష్‌రెడ్డి అమాయకుడని జగన్ రెడ్డి చెబుతుంటే సీబీఐ ఎందుకు సైలెంట్‌గా ఉంది? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానందారెడ్డి కేసులో సుత్రధారి అతనే అని.. అతను అమాయకుడు కాదని సీబీఐనే ప్రజలకు తెలియజేయాలని చెప్పుకొచ్చారు.
TDP: వైఎస్ షర్మిల నిన్న ఒక రహస్యం చెప్పారు: కనకమేడల
జగన్‌కు గులరాయి తగిలి 13 రోజులవుతున్నా ప్లాస్టర్ తీయకుండా ఐప్యాక్ సూచనలతో జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మూడు రోజులకు తీయాల్సిన ప్లాస్టర్‌ను అలాగే ఉంచుకుని ప్రచారం చేస్తున్నారన్నారు. సెప్టిక్ అవుతుందని డాక్టర్లు చెప్పినా.. ఓట్లే ముఖ్యమని జగన్ అనుకుంటున్నారని అన్నారు. మహిళలకు పెద్దాపరేషన్ చేసినా.. వారానికే కుట్లు ఊడతీస్తారని.. కానీ జగన్ గులకరాయి దెబ్బకు మాత్రం 13 రోజులైనా ప్లాస్టర్ ఎందుకు ఊడలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
AP Elections: మేమెప్పుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్న బొత్స
AP Elections: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్..!
Read Latest Andhra Pradesh News or Telugu News