Share News

AP Electiosn: సంక్రాంతి ముందే వచ్చిందే.. ఏపీ పల్లెల్లో సందడి..!

ABN , Publish Date - May 11 , 2024 | 02:32 PM

ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో పండుగలాంటిది. అందుకే ప్రపంచంలో ఎక్కడున్నా.. ఓట్ల పండుగకు ఇంట్లో వాలిపోతారు. ఏపీలో మే13న పోలింగ్ జరగనుంది. దీంతో సంక్రాంతి ఏడు నెలల ముందే వచ్చిందా అన్నట్లు ఉంది పరిస్థితి. జనమంతా నగరాల నుంచి స్వగ్రామాలకు క్యూకట్టారు. గతంలో ఎన్నికలంటే సొంతూళ్లకు వచ్చేవారి శాతం తక్కువుగా ఉండేది. ఈసారి మాత్రం ఏపీలో ఎన్నికలు కాకరేపుతుండటంతో ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

AP Electiosn: సంక్రాంతి ముందే వచ్చిందే.. ఏపీ పల్లెల్లో సందడి..!
AP Elections 2024

ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో పండుగలాంటిది. అందుకే ప్రపంచంలో ఎక్కడున్నా.. ఓట్ల పండుగకు ఇంట్లో వాలిపోతారు. ఏపీలో మే13న పోలింగ్ జరగనుంది. దీంతో సంక్రాంతి ఏడు నెలల ముందే వచ్చిందా అన్నట్లు ఉంది పరిస్థితి. జనమంతా నగరాల నుంచి స్వగ్రామాలకు క్యూకట్టారు. గతంలో ఎన్నికలంటే సొంతూళ్లకు వచ్చేవారి శాతం తక్కువుగా ఉండేది. ఈసారి మాత్రం ఏపీలో ఎన్నికలు కాకరేపుతుండటంతో ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలోని పల్లెల్లో ఓ రకంగా పండుగ వాతావరణం నెలకొంది. సాధారణంగా ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వన్ని ఉంచాలా.. మార్చాలా అనేది డిసైడ్ చేసేది ఓటరే. ఎన్నికల తర్వాత వచ్చే మార్పు కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూస్తుంటే మార్పు ముందే వచ్చిందా అనిపించేలా ఉంది. ఓట్ ఫర్ ఛేంజ్ అంటూ గ్రామాలకు జనమంతా చేరుకుంటున్నారు. గత ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమెదైంది.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం చూస్తుంటే ఈసారి మరింత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎక్కువ మంది హైదరాబాద్‌లో ఉంటారు. హైదరాబాద్‌లో సంక్రాంతి పండుగ సమయంలోనే ఎక్కువ రద్దీ ఉంటుంది. అలాంటి రద్దీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. వేల బస్సులు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్తున్నాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే 2019లో నమోదైన 80.3 శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్


విశ్వంలో ఎక్కడునా సొంతింటికి..

ఆంధ్రప్రదేశ్ ఓటరు ప్రపంచంలో ఎక్కడున్నా సొంతూరుకు వస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలనే పట్టుదలతో వస్తున్నాడు. హైదరాబాద్, బెంగళూరు నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు, ట్రైన్‌లు మాత్రమే కాదు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్, విజయవాడకు ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. గతంలో ఓటు అంటే నిర్లక్ష్యం వహించిన చాలామంది ప్రస్తుతం ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల నుంచి ఎక్కువమంది ఏపీకి వస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం కూడా ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లడానికి కారణంగా తెలుస్తోంది రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయా ప్రభుత్వాలు సెలవుగా ప్రకటించాయి. దీంతో విశ్వ వ్యాప్తంగా ఎక్కడో ఉన్న ఏపీ ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు.


మార్పు ముందే వచ్చిందా..

ఏపీలో ఎక్కడ చూసినా ప్రభుత్వం మారుతుందనే చర్చ జరగుతోంది. మరోవైపు ఓటరు చైతన్యం చూస్తుంటే మార్పు ముందే వచ్చినట్లు కనిపిస్తోందట. 2019 ఎన్నికల్లో కూడా భారీ సంఖ్యలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు వచ్చేవాళ్లు కాదు. ఈసారి మాత్రం ఆర్టీసీ, భారతీయ రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటుచేశాయి. దీంతో ఎక్కువమంది ఓటు వేసేందుకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.


భారీగా ట్రాఫిక్

తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలతో గట్టు భీమవరం, కీసర టోల్ ప్లాజా లు వద్ద అదనపు గేట్స్ తెరిచారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో విజయవాడలోని ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానిపురం లో భారీగా ట్రాఫిక్ స్థంబించింది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఓటర్లు విజయవాడ వచ్చి.. అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.


విదేశాల నుంచి

విదేశాల నుంచి ఏపీ వాసులు భారీగా తరలివస్తున్నారు. గత రాత్రి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఫుల్ అకుపెన్సీతో నడిచాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాల్లో అమెరికా నుంచి వచ్చిన ఆంధ్ర వాసులే ఎక్కువుగా ఉన్నారు. ఆస్ట్రేలియా లోని షార్జా నుంచి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల చెందిన 250 మంది షార్జా నుంచి ఓటు వేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


AP Elections: కూటమి అభ్యర్థికి మద్దతుగా జేపీ, లోకేష్ రోడ్‌ షో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 02:47 PM