Share News

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:54 AM

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.

Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల

అమరావతి: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60 వేల పైచిలుకు మెజార్టీతో విక్టరీ కొట్టారు. 77 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా ప్రజా సేవ చేస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆపార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత చిన్న అన్నగా బుచ్చయ్య చౌదరిని తెలుగుదేశం శ్రేణులు పిలుస్తారు.


పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి కంచుకోట. ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీలో ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ, సొంత ఛరిష్మాతో గెలుస్తూ వస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం విధానాలు నచ్చి పార్టీలో చేరారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజల నుంచి వచ్చిన నేత. ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగిస్తారు.

Updated Date - Jun 19 , 2024 | 10:57 AM