Share News

వైద్య విద్యార్థినులకు రక్షా బంధన్‌

ABN , Publish Date - Aug 20 , 2024 | 06:44 AM

రక్షా బంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో సోమవారం జూనియర్‌ డాక్టర్లు..

వైద్య విద్యార్థినులకు రక్షా బంధన్‌

  • మహిళా పీజీలతో రాఖీలు కట్టించుకున్న జూనియర్‌ డాక్టర్లు

  • జీజీహెచ్‌లో పటిష్ఠ రక్షణకు చర్యలు: ఎస్పీ, జేసీ

గుంటూరు (మెడికల్‌), ఆగస్టు 19: రక్షా బంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో సోమవారం జూనియర్‌ డాక్టర్లు.. మహిళా పీజీ విద్యార్థినులతో రాఖీలు కట్టించుకొని సోదర భావాన్ని ఘనంగా చాటారు.

వారికి రక్షణగా ఉంటామని ప్రమాణం చేశారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో ట్రైనీ పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను తీవ్రంగా నిరసిస్తూ గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరాయి.

ఓపీ సేవలు, ఎలెక్టివ్‌ సేవలు బహిష్కరించిన సూపర్‌ స్పెషాలిటీ విద్యార్థులు, మెడికల్‌ పీజీ విద్యార్థులు, హౌస్‌ సర్జన్లు నల్లబ్యాడ్జీలు ఽధరించి తమ నిరసన కొనసాగించారు. వైద్యులకు రక్షణ కల్పించే సెంట్రల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను అమలు చేసే వరకు తాము చేపట్టిన ఆందోళనను కొనసాగిస్తామని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. కోల్‌కతా ఘటనలో హంతకులకు కఠిన శిక్ష లు విధించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

Updated Date - Aug 20 , 2024 | 06:44 AM