Share News

AP News: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు..

ABN , Publish Date - Jun 28 , 2024 | 10:31 AM

పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

AP News: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు..

పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత (YCP Leader), మాజీ ఎమ్మెల్యే (Ex MLA) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy)పై మరో కేసు (Another case) నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివ (Komara Shiva)పై పిన్నెల్లి మాచర్ల కోర్టు (Macherla Court) వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 323 కింద మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.


కాగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు(మే 13న), మరుసటి రోజు జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ వర్గీయులు, సీఐపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలుచేసిన పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే.


వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస కల్యాణ్‌ ఎదుట హాజరుపరిచారు. 12:30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బెయిల్‌పై వాదోపవాదాలు జరిగాయి. పిన్నెల్లి తరఫున న్యాయవాది బాలసత్యనారాయణరెడ్డి వాదనలు వినిపించారు. కారంపూడి సీఐ అలహరి శ్రీనివాసరావు స్వయంగా హాజరయ్యారు.


పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, బయటకు వచ్చాక చెరుకూరి నాగశిరోమణిపై దూషణలు, బెదిరింపు కేసుల్లో మాజీ ఎమ్మెల్యేకు బెయిల్‌ మంజూరైంది. టీడీపీ ఏజెంటు నంబూరి శేషగిరిరావుపైన, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపైన దాడికి సంబంధించి నమోదైన హత్యాయత్నం (సెక్షన్‌ 370) కేసుల్లో మాత్రం న్యాయాధికారి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. గురువారం వేకువజామున 4:30 గంటలకు భారీ భద్రత నడుమ పిన్నెల్లిని పోలీసులు నెల్లూరు బయల్దేరారు. ఉదయం 9.10 గంటలకు అక్కడి జైలుకు చేరుకున్నారు. జైలు అధికారులు కోర్టు ఉత్తర్వులను పరిశీలించి లోపలకు తీసుకెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు..

జగన్ సర్కర్ చెప్పిందే.. కలెక్టర్లు పాటించారు..

ఓటమితో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 28 , 2024 | 10:33 AM