Share News

Pinnelli: పిన్నెల్లికి బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!

ABN , Publish Date - Jul 18 , 2024 | 06:33 PM

మాచర్లలో రాజకీయ అరాచకాలకు కేరాఫ్‌గా ఉన్న వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే..

Pinnelli: పిన్నెల్లికి బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!

నెల్లూరు/అమరావతి: మాచర్లలో రాజకీయ అరాచకాలకు కేరాఫ్‌గా ఉన్న వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా షాక్ తగిలిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కూడా బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. కాగా.. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు.


అరెస్ట్ ఇలా..!

ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్లపై దౌష్ట్యానికి పాల్పడిన కేసుల్లో జూన్-26న నరసరావుపేటలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. అరెస్ట్ చేశారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మొత్తం పిన్నెల్లిపై 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది కాబట్టి పిన్నెల్లిపై పోలీసులు అరెస్టు చేయగలిగారు. అదే గనుక ఈ దృశ్యాలు బయటకు రాకుంటే పిన్నెల్లి చేసిన సవాలక్ష పాపాల్లాగే ఈ నిజం కూడా సమాధి అయిపోయేదే. ఎన్నికలు జరిగిన మే 13వ తేదీన కేపీ గూడెం, రాయవరం పోలింగ్‌ బూత్‌లపై దాడులు చేశారు. పోలింగ్‌ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెంట్లపై హత్యాయత్నం చేశారు.


నాకేం తెలియదు..!

పోలింగ్ రోజున పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం, పాలువాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎం పగులగొట్టలేదని, అసలు నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని పోలీసు విచారణలో పిన్నెల్లి చెప్పడం గమనార్హం. అసలు ఆరోజు తన వెంట గన్‌మెన్ కూడా లేరని చెప్పారాయన. మొత్తానికి చూస్తే.. పిన్నెల్లికి ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Jul 18 , 2024 | 07:11 PM