Share News

గ్రామాభివృద్ధికి బాటలు

ABN , Publish Date - May 09 , 2024 | 01:56 AM

వినుకొండ ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా, శివశక్తి పౌండేషన్‌ ద్వారా 2009- 19లో ఈపూరు మండలంలో అనేక అభివృద్ధి పనులను చేశారు.

గ్రామాభివృద్ధికి బాటలు
ప్రభుత్వాసుపత్రి భవనం

ఈపూరు, మే8: వినుకొండ ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా, శివశక్తి పౌండేషన్‌ ద్వారా 2009- 19లో ఈపూరు మండలంలో అనేక అభివృద్ధి పనులను చేశారు. ముప్పాళ్ళ, కొచ్చెర్ల గ్రామాల్లో ప్రాఽథమిక వైద్యశాలల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, రైతుల సౌకర్యం కోసం సొసైటీ భవనాలను నిర్మించారు. గ్రామాల్లో, ఎస్సీ కాలనీల్లో, తండాల్లో సీసీరోడ్లు నిర్మాణం చేశారు. అదేవిధంగా తన స్వగ్రామం ఇనుమెళ్ళలో పేదలకు తన సొంత డబ్బులతో భూమి కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ నిధులతో రాయితీపై రుణాలు పంపిణీ చేసీ యువతకు ఉపాధి చూపించారు. మండలంలో ఎన్‌టీఆర్‌ గృహనిర్మాణం కింద రూ.20కోట్ల 42లక్షలతో 1321 మందికి గృహాలు మంజూరు చేశారు. రైతు రుణమాఫీ ద్వారా 8724 మంది రైతులకు రూ.53కోట్ల 86లక్షలు, 4221 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.5కోట్ల29 లక్షలు మంజూరు చేయించారు. 820 డ్వాక్రా గ్రూపుల్లోని 8107 మంది మహిళలకు పసుపు కుంకుమ కింద రూ.12కోట్ల50లక్షలు పంపిణీ చేశారు. 351 సిమెంట్‌ రోడ్లు, సైడ్‌ కాల్వల నిర్మాణానికి 29 కోట్ల 16 లక్షలు, చంద్రన్న భీమా ద్వారా రూ.3కోట్ల 12లక్షలు మంజూరు చేశారు. మండల కేంద్రమైన ఈపూరు నుంచి ముప్పాళ్ళకు ఆర్‌అండ్‌బీ తారు రోడ్డు నిర్మాణానికి రూ.కోట్లు మంజూరు, మండలంలో 15 తారురోడ్లు నిర్మాణం మరమ్మత్తులకు రూ.39కోట్ల 52లక్షలు మంజూరు చేయించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 203 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల 3లక్షలు, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 189 మంది లబ్ధిదారులకు కోటి 90లక్షలు, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 315 మందికి రూ.3కోట్ల 16లక్షలు, మైనార్టీ కార్పొరేన్‌ ద్వారా 7గురికి రూ.7లక్షలు, కాపు కార్పొరేషన్‌ ద్వారా 189 మందికి కోటి 90లక్షలు మంజూరు చేశారు. ఎన్‌టీఆర్‌ జలసిరి పథకం ద్వారా రూ.9కోట్ల44లక్షలతో 214 బోర్లు మంజూరు చేశారు. ఆర్‌డబ్ల్యుయస్‌ ద్వారా 27 పనులకు రూ.5కోట్ల 26లక్షల నిధులు మంజూరు చేశారు. హార్టీ కల్చర్‌ ద్వారా 1036 మంది రైతులకు కోటి 4లక్షలు 79 వేలు సబ్సిడీ మంజూరు చేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా 144 మంది నిరుద్యోగులకు ప్రతి నెల రూ2వేలు పంపిణీ చేశారు. వనికుంటలో మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేశారు. వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణం కోసం మండలానికి రూ.159 కోట్లు మంజూరు చేశారు. నిరుపేదలు పండుగలను సంతోషకరంగా జరుపుకునేందుకు రంజాన్‌ తోఫా, సంక్రాంతి కానుకలు అందజేశారు. బడికివెళ్లే ఆడపిల్లల సౌకర్యార్ధం సైకిళ్లు పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మండలాన్ని అన్ని విధాల అభివద్ధి చేస్తానని జీవీ ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును గెలిపించుకుంటే రాష్ట్రాభివృద్ధికి పాటుపడతారన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించాలని కోరారు.

Updated Date - May 09 , 2024 | 01:56 AM