Share News

వైసీపీలో స్పష్టంగా ఓటమి భయం

ABN , Publish Date - May 09 , 2024 | 01:46 AM

జగనరెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ- జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి ఎద్దేవా చేశారు.

వైసీపీలో స్పష్టంగా ఓటమి భయం
ఎన్నికల ప్రచారంలో గళ్లా మాధవి, కోవెలమూడి రవీంద్ర, తాడిశెట్టి మురళి

గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): జగనరెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ- జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి ఎద్దేవా చేశారు. గుం టూరు 49, 52 డివిజన్లలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. గుంటూరు వేళాంగిణి నగర్‌, పొట్టి శ్రీరాములు నగర్‌లో జోన 5 టీడీపీ ఇనచార్జి కోవెలమూడి రవీంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు తాడిశెట్టి మురళి, మద్దిరాల మ్యాని, కసుకుర్తి హనుమంతరావులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ జగన అస్తవ్యస్తమైన, దిక్కుమాలిన పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఊహించి ముందే ఓటమిని అంగీకరిస్తున్నాడన్నారు. జగనరెడ్డి ఐదేళ్లుగా రాషా్ట్రన్ని, రాష్ట్ర వనరులను నాలుగు లక్షల కోట్లకు దోచుకున్నాడని ఆమె ఆరోపించారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పులు చేశాడని, అసలు గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం ఎదురుచూసే రోజులు ఉన్నాయా, కానీ జగన రెడ్డి వచ్చాక ఉద్యోగులు జీతం మహాప్రభో అని మొరపెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. జగనరెడ్డికి ప్రజా శ్రేయస్సు ఏమాత్రం పట్టదని, తన కుటుంబం, తన ఆదాయం తప్ప మరో ఆలోచన ఉండదని మాధవి విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ శ్రీవల్లి, తెలగతోటి సుధీర్‌, మర్రిపాటి శ్రీనివాస్‌, మునగ నూకాలమ్మ, కన్నసాని బాజీ పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:46 AM