Share News

జనమంతా ఓ వైపు.. జగన్‌ ఓ వైపు

ABN , Publish Date - May 09 , 2024 | 02:01 AM

జనం అందరూ ఒక వైపు ఉన్నారు, జగన్‌ ఒక వైపు ఉన్నారు, తప్పకుండా తీర్పు జనం వైపు ఉంటుందని దివంగత వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధా అన్నారు.

జనమంతా ఓ వైపు.. జగన్‌ ఓ వైపు

ప్రజలు కూటమిని గెలిపించాలనే సంకల్పంతో ఉన్నారు

శ్రీకృష్ణదేవరాయులు, అరవిందబాబులు ఎంతో మంచి నేతలు

ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధా

నరసరావుపేట టౌన్‌, మే 8: జనం అందరూ ఒక వైపు ఉన్నారు, జగన్‌ ఒక వైపు ఉన్నారు, తప్పకుండా తీర్పు జనం వైపు ఉంటుందని దివంగత వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధా అన్నారు. గురువారం నరసరావుపేటలో టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ జరిగింది. జొన్నలగడ్డ సాయిబాబా ఆలయం నుంచి సత్తెనపల్లి రోడ్డు రంగా విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు రాధాకు టీడీపీ శ్రేణులు గజమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముఖ్య అతిఽథిగా హాజరైన రాధా మట్లాడుతూ కూటమిని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సంకల్పంతో ఉన్నారని, ఇది పార్టీ కూటమి మాత్రమే కాదని, ప్రజా కూటమి అని అన్నారు. ఈ ప్రాంతంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మంచి పేరుందని, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు సౌమ్యులని, వారిని ప్రజలు గెలిపిస్తారని అన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తూ మద్దుతు తెలుపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామ చంద్రప్రసాదు, బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్‌, సయ్యద్‌ జిలాని, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ముందుగా జనసేన కార్య కర్తలు పట్టణంలో భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - May 09 , 2024 | 02:06 AM