Share News

ఆదరించండి.. అండగా నిలుస్తా

ABN , Publish Date - May 09 , 2024 | 01:51 AM

ఆదరిస్తే అండగా నిలుస్తానని టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు తెలిపారు. బుధవారం ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది.

ఆదరించండి.. అండగా నిలుస్తా
ఎన్నికల ప్రచారంలో అరవిందబాబు

నరసరావుపేట, మే 8: ఆదరిస్తే అండగా నిలుస్తానని టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు తెలిపారు. బుధవారం ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలన్నారు. బీసీ అభ్యర్థి అయిన తనపై చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో టిక్కెట్‌ కేటాయించారన్నారు. తనకు బీసీలు అండగా నిలిచి విజయానికి కృషిచేయాలని కోరారు. తాను గెలిస్తే బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తానని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ చూసినా విధ్వంసమే. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను పెంచి సాన్యులపై వైసీపీ ప్రభుత్వం మోయలేని భారం వేసిందని విమర్శించారు. ఇసుక, మట్టి మాఫియాతో వైసీపీ నేతలు ప్రభుత్వం సొమ్మును దోచుకున్నారన్నారు. జగన్‌ పాలనలో అన్ని రంగాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామని అరవిందబాబు అన్నారు.

50 ఏళ్లకే పింఛను..

కూటమి అధికారంలోకి వస్తే సామాన్యులకు సంక్షేమ పథకాలు అందిస్తూనే సమాంతరంగా అభివృద్థికి పెద్దపీట వేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో పేదలకు 50 ఏళ్లకే పింఛను నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు అందించడం జరగుతుందన్నారు. జగన్‌ వచ్చాక రాష్ట్రంలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయని చెప్పారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పలు పథకాలు ప్రవేశపెట్టారు. సూపర్‌-6 హామీల్లో మహిళలకే తొలి ప్రాధాన్యం. మహిళలకు నెలకు రూ.1500 బ్యాంకులో వేస్తామని మేనిఫెస్టోలో ఉంది. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం వల్ల మహిళలకు ఖర్చు తగ్గుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల వారు కష్టపడి సంపాదించే సొమ్ము ఆదా చేసుకోవచ్చు. తల్లికి వందనం ద్వారా చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ వర్తింపజేయడం వల్ల చదువుల ఖర్చు తగ్గుతుందని అరవిందబాబు చెప్పారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసీ గెలిపించాలని అరవిందబాబు కోరారు.

Updated Date - May 09 , 2024 | 01:52 AM