Share News

ముగ్గురు ఖాకీలపై వేటు

ABN , Publish Date - May 09 , 2024 | 01:58 AM

రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన పల్నాడులోని మాచర్లలో ముగ్గురు పోలీసులపై ఎన్నికల కమిషన్‌ వేటువేసింది. ఖాకీ ముసుగులో వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరి స్తున్నందుకు పర్యవసానంగా ఇద్దరు సీఐలు, మరో ఎస్‌ఐని విధుల నుంచి తప్పించింది. మాచర్ల టౌన్‌ సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా శ్రీహరిలపై బదిలీ వేటు వేసింది.

ముగ్గురు ఖాకీలపై వేటు

పల్నాడులో ఇద్దరు సీఐలు ఒక ఎస్‌ఐ విధుల నుంచి తప్పుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు

ఖాకీ ధరించి వైసీపీ కార్యకర్తల్లా పనిచేసినందుకు పర్యవసానం

గుంటూరు,మే8: రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన పల్నాడులోని మాచర్లలో ముగ్గురు పోలీసులపై ఎన్నికల కమిషన్‌ వేటువేసింది. ఖాకీ ముసుగులో వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరి స్తున్నందుకు పర్యవసానంగా ఇద్దరు సీఐలు, మరో ఎస్‌ఐని విధుల నుంచి తప్పించింది. మాచర్ల టౌన్‌ సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా శ్రీహరిలపై బదిలీ వేటు వేసింది.

అకారణంగా తుపాకితో బెదిరింపు..

ఆరు నెలల క్రితం కారంపూడి సీఐగా బాధ్యతలు స్వీకరించిన చిన్న మల్లయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా విధులు నిర్వహించారు. ఇటీవల కారంపూడిలోని టీస్టాల్‌ వద్ద టీ తాగుతున్న దివ్యాంగుడిని చిన్న మల్లయ్య అకారణంగా కొడుతుండడంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు చప్పిడి రాము ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా నీకోసమే చూస్తున్నాను అంటూ తన తుపాకీ బయటకు తీసి రాముని బెదిరిస్తూ చొక్కా పట్టుకొని ఈడ్చి జీపులో స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌ ముట్టడికి వెళ్ళడంతో గత్యంతరం లేక వదిలేశాడు. ముఖ్యంగా చిన్న మల్లయ్య టీడీపీ కార్యకర్తలను ేస్టషన్‌కు పిలిపించి బెదిరించడం, తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతానని వేధింపులకు పాల్పడం వంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇటీవల మిరియాల గ్రామంలో టీడీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే జంగాని గ్రామానికి ఆహ్వానించిన భక్తుల శ్రీనివాస్‌ యాదవ్‌ అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌ ట్రక్కులోని వరిగడ్డికి వైసీపీ నాయకులు నిప్పు పెట్టారు. దీనిపై బాధితులు శ్రీనివాస్‌ యాదవ్‌ పోలీస్‌ ేస్టషన్లో ఫిర్యాదు చేసినా సీఐ స్పందించలేదు. అయితే టీడీపీ వారిపై మాత్రం తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు.

హత్యాయత్నం కేసులు బనాయింపు..

మాచర్ల టౌన్‌ సీఐ శరత్‌ బాబు చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇటీవల మాచర్ల పట్టణంలోని ముస్లిం బజార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బ్రహ్మారెడ్డి రాకను స్వాగతిస్తూ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కడుతుండగా వారిపై వైసీపీ కార్యకర్తలు నాయకులు కర్రలతో దాడి చేసి కొట్టారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేేస్త కనీసం తీసుకోకపోగా వైసీపీ వారి నుంచి ఫిర్యాదు తీసుకొని పదిమంది టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు బనాయించి వారిని అరెస్టు చేసి జైలుకు పంపేందుకు ప్రయత్నించారు అయితే వారు ముందస్తు బెయిలు పొందడంతో కొంతవరకు ఉపశమనం కలిగింది. ఇటీవల మాచర్ల పట్టణంలో టీడీపీ కార్యకర్త ఎర్ల సురేష్‌కు చెందిన కారును వైసీపీ నాయకులు పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. అయితే కారు తగలబెట్టించిన వైసీపీ నాయకులను వదిలేసి నిప్పుపెట్టిన ముగ్గురు కార్యకర్తలతో కేసు నమోదు చేసి వారికి కూడా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. ఎన్నికల ప్రచారానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి సంబంధించిన ప్రచార వాహనం పట్టణంలోకి రాగా దానిని చుట్టుముట్టి అందులో వచ్చిన వారిని బయటకు తీయకుండా వాహనాన్ని కదలకుండా రెండు గంటలేసపు ఇబ్బందిలకు గురిచేశాడు.

ఖాకీలకే కళంకం..

వెల్దుర్తి ఎస్‌ఐ వంగ శ్రీహరి ఖాకీ డ్రస్సుకే కళంకం తెచ్చేదా వ్యవహరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో వారిని వెంటాడి వేటాడారు. మాచర్ల నియోజకవర్గంలో అసలు పోలీసులు ఉన్నారా అనే సందేహం కలిగేలా వీరు వ్యవహరించారు. ఎస్‌ఐ శ్రీహరి వేధింపుల కారణంగా టీడీపీకి చెందిన మత్స్యకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన గుల్లపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యను వైసీపీ వర్టీయులు దారుణంగా హత్య చేస్తే వారిని వదిలేసి, టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. కాటన్‌ సెర్చ్‌ పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లల్లో తనిఖీలు చేసి తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేశారు అదేవిధంగా గొట్టిపాట్ల గ్రామంలో టీడీపీ నాయకులు ఊరు వదిలి వెళ్ళేలా వేధింపులకు పాల్పడ్డారు. చట్టాన్ని అతిక్రమించేలా వ్యవహరించిన ఇద్దరు సీఐలు, మరో ఎస్‌ఐపై బదిలీ వేటు వేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మాచర్ల నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ ముగ్గురు పోలీసుల బదిలీపై ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - May 09 , 2024 | 07:49 AM