Share News

MP Vijayasai Reddy: విజయసాయి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , Publish Date - Sep 04 , 2024 | 07:44 AM

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు జేసీబీలు ఆ ప్రాంతానికి చేరుకుని కూల్చివేతలను ప్రారంభించాయి.

MP Vijayasai Reddy: విజయసాయి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
vijaya sai reddy

విశాఖ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాయి. భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణాన్ని నేహారెడ్డి చేపట్టారు. ఉల్లంఘనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరస కథనాలు ప్రసారం అయ్యాయి. నేహా రెడ్డి సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. బీచ్‌లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నేహా రెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని.. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.


విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి కాంక్రీట్ గోడను నిర్మించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ వేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని గత నెలలో హైకోర్టు నిర్దేశించి ఆపై తదుపరి విచారణను సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. భీమిలి బీచ్‌ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ తరఫున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్‌ వాదనలు వినిపించారు.

Updated Date - Sep 04 , 2024 | 07:52 AM