Share News

AndhraPradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ తుపాను..

ABN , Publish Date - Oct 18 , 2024 | 07:53 PM

తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాంటి వేళ మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు... మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AndhraPradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ తుపాను..

తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాంటి వేళ మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు... మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగాళాఖాతం, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఈ నెల 20వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదలకు రంగం సిద్ధం


ఇది మరో 48 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇది మయన్మార్‌, థాయిలాండ్‌ మీదుగా మధ్య అండమాన్‌లోకి ప్రవేశించనుందని వివరించింది. అనంతరం గల్ఫ్‌ ఆఫ్ మార్టబాన్‌, అరకాన్‌ కోస్ట్‌ గుండా వెళ్లనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడన ద్రోణి తీవ్ర తుపాను మారి.. బంగాళాఖాతం మధ్య నుంచి వాయువ్య దిశగా పయనిస్తుందంది. ఇది తిరిగి అక్టోబర్‌ 22 తెల్లవారుజాము వరకు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది అక్టోబర్‌ 23వ తేదీ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరే అవకాశం ఉందని.. అయితే, దీని ప్రభావం అధికా శాతం సముద్రంలోనే కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Viral News: రైతు నివాసంలో రూ. కోట్లు చోరీ.. దొంగలను పట్టించ్చిన కుక్క


ఇక ఇది 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారవచ్చునని చెప్పంది. అయితే ఇది తీవ్ర తుపానుగా మారుతుందా? అనేది ప్రస్తుతం అంచనా అయితే వేయలేమని పేర్కొంది. ఒక వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారితే మాత్రం ఈ సీజన్‌లో ఇది తొలి తుపాను అవుతుందని పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, మయన్మార్‌ తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం అధికంగా చూపే అవకాశముందంది.

Also Read: Dhanteras 2024: ధనత్రయోదశి నుంచి దశ తిరగనున్న రాశులివే..


ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చునని వివరించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అయితే అండమాన్ నికోబార్ తీరంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Also Read: Atla Tadde: ఆ దోషం తొలగాలంటే.. అట్లతద్ది రోజు ఇలా చేయండి..


మరోవైపు అక్టోబర్ 14 నుంచి 17వ తేదీ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందంటూ వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర విపత్తు నిర్వహాణ సంస్థ ఎండీ ఆర్. కూర్మనాథ్ వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో హెల్ఫ్ లైన్లు సైతం ఏర్పాటు చేసింది. తాజాగా మరోసారి వాతావరణ శాఖ తుపాన్ వచ్చే అవకాశముందని హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ మళ్లీ అప్రమత్తమైంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 08:07 PM