Share News

Kesineni Chinni: జగన్ చెప్పిన లిస్ట్‌లో వైఎస్ వివేకా కూడా ఉన్నారేమో..

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:01 PM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్‌పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు.

Kesineni Chinni: జగన్ చెప్పిన లిస్ట్‌లో వైఎస్ వివేకా కూడా ఉన్నారేమో..

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్‌పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారంటూ విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను బతిమాలినా ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదన్నారు. దీంతో అఖిలేష్ యాదవ్‌ను తీసుకువచ్చి హడావిడి చేశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారన్నారు. తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని.. అందులో వైఎస్ వివేకా కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.


ఎన్డీయే నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని కేశినేని చిన్ని అన్నారు. ఏపీకి కేంద్ర సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎంపీలం అంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. చంద్రబాబు కృషి వల్ల కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందన్నారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైను కూడా ఇస్తున్నారన్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుతున్నారని.. జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని కేశినేని చిన్ని విమర్శించారు.


జగన్ తీహార్ జైలుకు వెళ్లక తప్పదు..

తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ.. జగన్ కు భయపడి ఈ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు మళ్లీ జీవితంలో అతని పార్టీకి ఓటెయ్యరని అన్నారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడని విమర్శించారు. ఏపీలోనే జగన్ ని పట్టించుకునేవారు లేనప్పుడు ఇక దిల్లీలో ఎవరుంటారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఏకైక సీఎం జగనేనని నాగుల్ మీరా విమర్శించారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబుకు కల్పించాడని నాగుల్ మీరా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 12:01 PM