TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Oct 18 , 2024 | 06:19 PM
ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి కోట్లాది మంది భక్తులున్నారు. వారంతా ఏడాదిలో ఏదో ఒక రోజులో.. ఆయన్ని దర్శించుకునేందుకు తిరుమలకు తరలి వస్తారు. ఆ క్రమంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివిధ చర్యలు చేపట్టింది. వారిని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఉన్న పలు సేవా టికెట్లను టీటీడీ విక్రయిస్తుంది.

ఆ క్రమంలో 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను అక్టోబర్‌లో టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. అందులోభాగంగా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకో వచ్చని టీటీడీ ప్రకటించింది. అయితే ఈ టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇక వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని వివరించింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వివరించింది.
వర్షాకాలం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుమలలో సైతం భారీగా వర్షం పడుతుంది. దీంతో తిరుపతి చుట్టుపక్కన ఆవరించిన ఏడుకొండలు సైతం పచ్చదనాన్ని పరుచుకుంది. ఓ వైపు వరుస సెలవులు రావడం.. వాతావరణం అహ్లాదకరంగా మారడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు. అదీకాక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత టీటీడీలో పలు సంస్కరణలు చేపట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల తిరుమలకు పోటెత్తుతున్నారు.
For Andhra Pradesh News And Telugu News..