Share News

జిల్లాలో 1129.0 మి.మీ వర్షపాతం

ABN , Publish Date - May 08 , 2024 | 11:00 PM

అన్నమయ్య జిల్లాలో మంగళ, బుధవారాల్లో 1129.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా గణాంక అధికారి తెలియజేశారు.

జిల్లాలో 1129.0 మి.మీ వర్షపాతం
వర్షంలో తడుస్తున్న రాయచోటి వీధులు

రాయచోటిటౌన, మే 8: అన్నమయ్య జిల్లాలో మంగళ, బుధవారాల్లో 1129.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా గణాంక అధికారి తెలియజేశారు. మంగళవారం రాత్రి 1129.0 వర్షపాతం నమోదు కాగా, గాలివీడు 5.4 మిల్లీమీటర్లు, చిన్నమండెం 10.0, సంబేపల్లె 12.4, సుండుపల్లె 42.0, రాయచోటి 29.4, లక్కిరెడ్డిపల్లె 7.0, రామాపురం 60.2, వీరబల్లి 61.4, నందలూరు 26.6, పెనగలూరు 32.0, చిట్వేల్‌ 21.0, రాజంపేట 49.0, పుల్లంపేట 38.0, ఓబులవారిపల్లె 26.8, కోడూరు 50.2, మొలకలచెరువు 49.4, తంబళ్లపల్లె 27.8, పెద్దమండెం 39.02, గుర్రకొండ 11.0, కలకడ 32.8, కేవీపల్లె 57.2, పీలేరు 41.6, కలికిరి 21.4, వాల్మీకిపురం 24.2, కురబల కోట 33.6, పెద్దతిప్పసముద్రం 45.2, బీ. కొత్తకోట 81.0, మదనపల్లె 114.2, నిమ్మనపల్లె 31.2, రామసముద్రం 47.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.

నేల రాలిన మామిడికాయలు

లక్కిరెడ్డిపల్లె: మండలంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దప్పేపల్లె పంచాయతీలోని వీరారెడ్డిగారిపల్లె, మేడిమాకుల గుంత, రెడ్డివారిపల్లె, డి.రామాపురం, దిన్నెపాడు పంచా యతీలోని దిన్నెపాడు, నరసింహరాజుగారిపల్లె, వడ్డెపల్లె, పర్వతరెడ్డిగారిపల్లె, కోనంపేట గ్రామాల్లో మంగళవారం రాత్రి పెనుగాలులు, వర్షానికి మామిడి చెట్టు విరిగిపోయా యి. కాయలు నేలరాలాయి. వర్షాభావం కారణంగా కాపు సక్రమంగా లేక నిరాశలో ఉన్న రైతుకు ఈ వర్షం మరిం త నష్టం చేకూర్చింది. మామిడి కాయలు నేలపాలు కావ డంతో ఈ ఏడాది కూడా అప్పులే మిగిలాయని, ప్రభు త్వం తమను ఆదుకోవాలని దప్పేపల్లె కస్పాకు చెందిన శ్రీరాములు, లక్ష్మిదేవి, వెంకటనారాయణ, సుబ్బారెడ్డి, వీరనాగిరెడ్డి కోరారు,

్ల 483 ఎకరాల్లో అరటిపంట నేలమట్టం

రాజంపేట : పెనుగాలుల కారణంగా మండల పరిధిలోని ఆకేపాడు, మందపల్లె, పులపత్తూరు, హస్తవరం, బ్రాహ్మణ పల్లె, పెద్దకారంపల్లె, ఊటుకూరు పరిధిలో 483 ఎకరాల్లో అరటిపంట నేలమట్టమైనట్లు ఉద్యాన అధికారి జి.సురేష్‌ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే తోటలను పరిశీలించి నష్టనివేదికలను తయారు చేసి ఉన్నతా ధికారులకు పంపామన్నారు.

చిట్వేలి : చిట్వేలి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల గాలికి విద్యుత స్తంభాలు కూలి పోయియి. మామిడి కాయలు రాలిపోగా అర్ధరాత్రి నుంచి విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి విద్యుత అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.

Updated Date - May 08 , 2024 | 11:01 PM