Share News

minister mandipalli ఆలయాల ద్వారా భక్తి భావం

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:55 PM

ప్రస్తుత సమాజంలో ఆలయాల ఏర్పాటుతో ప్రజల్లో భక్తిభావం పెంపొందడంతో పాటు సంఘంలో సమైక్యత ఏర్పడుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

minister mandipalli ఆలయాల ద్వారా భక్తి భావం
గాలివీడులో రామాలయ రాజగోపురాన్ని ప్రారంభిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

గాలివీడు, సెప్టెంబరు 6: ప్రస్తుత సమాజంలో ఆలయాల ఏర్పాటుతో ప్రజల్లో భక్తిభావం పెంపొందడంతో పాటు సంఘంలో సమైక్యత ఏర్పడుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గాలి వీడులోని కోదండ రామాలయంలో నూతనంగా నిర్మించిన రాజగో పురాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రికి జిల్లా దేవ దాయ, ధర్మాదాయశాఖ అధికారి విశ్వనాధం, వేదపండితులు నాగ ఫణికిశోర్‌శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో విశేష కృషి చేస్తుందని తెలిపారు. గతంలో దేవాలయాల్లో ధూప దీప నైవేద్యానికి నెలకు కేవలం రూ.5 వేలు ఇస్తుండగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్చకుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ మొత్తాన్ని పదివేలకు పెంచార న్నారు. దేవాలయ భూములు ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజా సమస్యలపై విన తు లను స్వీకరించారు. బద్వేల్‌ నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి రితేశరెడ్డి, రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు లక్ష్మిప్రసాద్‌రెడ్డి, తహ సీల్దార్‌ భాగ్యలత, మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు గీదర ఈశ్వర్‌రెడ్డి, సర్పంచ పార్థసారధిరెడ్డి, టీడీపీ నాయకుడు కొండ్రెడ్డి శ్రీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 11:55 PM