చిచ్చుపెడుతున్న అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:12 AM
దళితుల మధ్య చిచ్చుపెడుతున్న అగ్రవర్ణాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య డిమాం డ్ చేశారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య
పులివెందుల రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దళితుల మధ్య చిచ్చుపెడుతున్న అగ్రవర్ణాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య డిమాం డ్ చేశారు. దాడిలో గాయపడ్డ కృష్ణమూర్తిని మంగళవారం ఆయ న పరామర్శించారు. అనంతర మాట్లాడుతూ ఇటీవల సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన ముమ్మె భార్గవ, ఆయన తండ్రి వెంకటరమణలపై గజ్జల చంద్రశేఖర్రెడ్డి దాడి చేశారన్నారు. దీనిపై సింహాద్రిపురం పోలీ్సస్టేషనలో కేసు నమోదైందన్నారు. కేసు నమోదు వెనుక అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఉన్నాడనే కారణంతో తన అనుచరుడుగా ఉన్న చిన్నఓబయ్య అనే వ్యక్తితో దాడిచేయించారన్నారు. సోమవారం రాత్రి బలపనూరు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కృష్ణమూర్తిపై చిన్నఓబయ్య కట్టెతో దాడి చేసి గాయపరిచాడన్నారు. చిన్నఓబయ్యకు, కృష్ణమూర్తికి ఎటువంటి విరోధం లేదన్నారు. కేవలం తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైందనే కారణంతో గజ్జల చంద్రశేఖర్రెడ్డి చిన్నఓబయ్యను ఉసిగొలిపి దాడి చేయించారని తేలిందన్నారు. దళితులు ఐక్యంగా ఉండకూడనే దురుద్దేశంతో ఈ దాడి చే యించారని, దీనిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో డప్పు, చర్మకళాకారుల రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్యగారి కృష్ణమూర్తి, సూర్యనారాయణ, బాలనరసింహులు, అంజి, మహేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.