Share News

ప్రజాగళం మహాసభకు తరలిన కూటమి నేతలు

ABN , Publish Date - May 09 , 2024 | 12:12 AM

కలికిరిలో బుధవారం నిర్వహించిన ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ ప్రజాగళం మహాసభకు మండలం నుంచి టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

ప్రజాగళం మహాసభకు తరలిన కూటమి నేతలు
ప్రజాగళం సభ వద్ద తంబళ్లపల్లె కూటమి నాయకులు

నిమ్మనపల్లి, మే 8: కలికిరిలో బుధవారం నిర్వహించిన ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ ప్రజాగళం మహాసభకు మండలం నుంచి టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థు లు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, షాజహానబాషాలను భారీ విజయం సాధిస్తార న్నారు. వైసీపీ పాలనలో ప్రజలు విసుగుచెందారని తెలిపారు. టీడీపీ ప్రవేశ పెట్టిన సూపర్‌సిక్స్‌ పఽథకాలే ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. ప్రజాగళంసభకు వెళ్లిన వారిలో మండల అధ్యక్షుడు వెంకటరమణ, రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్‌, మాజీ ఎంపీపీ రెడ్డెప్పరెడ్డి, బీసీ అధికార ప్రతినిధి లక్ష్మన్న, సర్పంచ రెడ్డెప్ప, మాజీ ఎంపీపీ రామకృష్ణ, మాజీ సర్పం చలు రాజన్న, రమణ, మల్లప్ప, మహమ్మద్‌రఫి, శ్రీరాములు, మల్లికార్జున, నాయకులు సునీల్‌రెడ్డి, మురళి, కేశవ, గోపాలక్రిష్ణ, చంద్రసింగ్‌, సోము, శ్రీనివాసులు, నరసింహులు, శ్రీపతి, సుధాకర్‌, సహదేవ, జగధీష్‌, రెడ్డెప్ప, జయన్న, చినబాబు, చెండ్రాయుడు, ఖసింమ్‌ఖాన, బాబు, చంద్ర ఉన్నారు.

గుర్రంకొండలో:దేశ ప్రధాని నరేంద్ర మోదీ కలికిరి పర్యటనకు గుర్రంకొండ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తరలివెళ్లారు. ఇందులో భాగంగా నాయకులు, కార్యకర్తలు బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో వేలాదిగా మోదీ సభకు వెళ్లారు. ప్రతి గ్రామం నుంచి పదుల సంఖ్యలో వాహనాలు సభకు వెళ్లడం కూటమి అభ్యర్థుల్లో గెలుపు దీమాను కనబరుస్తోంది.

తంబళ్లపల్లెలో: రాష్ట్రంలో రాబో యేది కూటమి ప్రభుత్వమేనని తంబళ్లపల్లె కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కలికిరిలో ప్రధాని మోదీ ప్రజాగ ళం బహిరంగ సభకు తంబళ్లప ల్లె నుంచి కూటమి నాయకులు భారీగా తరలివెళ్లారు. బుధవారం ఉదయం మండలంలో పలు గ్రామాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో నినా దాలు చేసుకుంటూ ఉత్సాహం గా కలికిరి సభకు భారీగా తరలి వెళ్లారు.

వాల్మీకిపురంలో: కలికిరిలో బుధవారం నిర్వహించిన ప్రఽ దాని మోదీ బహిరంగ సభకు వాల్మీకిపురం మండలం నుంచి భారీ సంఖ్యలో నాయకులు తర లివెళ్లారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి భారీగా వాహనాలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు, యువత భారీగా తరలి వెళ్లారు.

Updated Date - May 09 , 2024 | 12:12 AM