Share News

బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించడం శుభపరిణామం

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:20 AM

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించడం శుభపరి ణామమని టీడీపీ నేతలు బాలకృష్ణారెడ్డి, మోహనరెడ్డిలు పేర్కొన్నారు.

 బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించడం శుభపరిణామం

కురబలకోట, జూలై 23: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించడం శుభపరి ణామమని టీడీపీ నేతలు బాలకృష్ణారెడ్డి, మోహనరెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అంగళ్ళులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి నిర్మాణానికి రూ15వేల కోట్లు కేటాయించడంపై టీడీపీ, బీజేసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం త్వరితగతిన పూర్తవతుందని, దీంతో పంటపొలాలతో సస్య శ్యామలం అవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో ఎంతోవెనకబడ్డామని, తిరిగి పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంల సారధ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. వైసీపీ అధినేత జగన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఢిల్లీకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని అక్కడ ధర్నా చేస్తున్నావని వారు ప్రశ్నించారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసి 5సంవత్సరాలు కావస్తున్న ఇంత వరకు ధర్నా చేయలేదన్నారు. నిజంగా ఆయనపై ప్రేమ ఉంటే పులివెందులలో ధర్నా చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగిరెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్‌, ఆనంద్‌, నాగరాజు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరావతికి 15వేల కోట్లు ప్రకటించడం హర్షణీయం

నిమ్మనపల్లి, జూలై 23: రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 15వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని టీడీపీ బీసీ సాధికారత జిల్లా కన్వీనర్‌ లక్ష్మ న్న పేర్కొన్నారు. మంగళ వారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత వైౖసీపీ ప్రభుత్వం లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధికి నాటి నాయకులు తీసుకురాలేదన్నారు. మంగళవారం డిల్లీ పార ్లమెంట్‌లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మలాసీతారామన బడ్జెట్‌ ప్రవేశపెట్టగా అందులో ఏపీలోని అమరావతి, పోలవరం, కొన్ని నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ప్రనటన చేయడం అభినందనీయమన్నారు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకళ్యానలకు ధన్యవా దాలు తెలియజేశారు. దీంతో రాష్ట్రాభివృధ్ది పరుగులు తీస్తుందన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 12:20 AM