Share News

రికార్డులు భద్రమేనా

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:28 PM

ములకలచెరువు తహసీల్దార్‌, గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో ఉన్న రిక్డాలు భద్రంగా ఉన్నా యానని అనుమానం కలుగుతోంది.

రికార్డులు భద్రమేనా
ఉపాధి హామీ కార్యాలయంలో గదిలేక సమాశపు గదిలో ఉన్న మస్టర్లు

చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం

తహసీల్దార్‌, ఉపాధిహామీ కార్యాలయాల్లో కన్పిస్తున్న నిర్లక్ష్యం

రెవెన్యూ కార్యాలయంలో మీటరు వద్ద బయటకు కనిపిస్తున్న కరెంటు వైర్లు..?

ములకలచెరువు, జూలై 25: ములకలచెరువు తహసీల్దార్‌, గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో ఉన్న రిక్డాలు భద్రంగా ఉన్నా యానని అనుమానం కలుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ రికార్డులు, పత్రాలు ఉండడంతో నిర్లక్ష్యం కన్పిస్తోంది. తహసీల్దార్‌ కార్యాయంలో సమావేశపు, వీఆర్‌వోల గదుల్లో రికార్డులు ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి. వీఆర్‌వోల గదిలో బీరువాలపైన పత్రాలు ఉంచారు. అలాగే కార్యాలయంలోని ఓ గదిలో ఉంచిన సర్టిఫికెట్ల ఓసీ పత్రాలకు ఉన్న చిన్న కిటకీలకు తలుపులు లేవు. ప్రధాన, ముఖ్య రికార్డులు ఉన్న గదికి సమీపంలో వర్షం వస్తే ఉరుస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద విద్యుత మీటర్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత మీటరు ఉన్న చోట కరెంటు వైర్లు బయటకు కన్పిస్తున్నాయి. ఈ వైర్లను చూసిన వారు షార్ట్‌సర్క్యూట్‌ జరిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో మస్టర్లు, పత్రాలు భద్రపరిచేందుకు గది లేకపోవడంతో సమావేశపు గదలో ఉంచారు. దీంతో ఇక్కడ మస్టర్ల భద్రతపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఉపాఽధి హామీ పథకంకు సంబంధించిన మస్టర్లు కూడా ముఖ్యమైన పత్రాలే. వీటిని భద్ర పరచాల్సిన అవసరం ఉంది. తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ పలు చోట్ల దెబ్బతిని నేలమట్టమైంది. ఇక్కడ తహసీల్దార్‌, ఎం పీడీవో, ఉపాధిహామీ, వెలుగు, సీఎల్‌ఆర్‌సీ కార్యాలయాలు ఉన్నాయి. ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా ప్రహరీ సరిగా లేకపోవడంతో భద్రత కరువైంది. ఇలా అయితే ముఖ్యమైన రికార్డులు కనిపించ కపోయినా, ఎవరైనా అపహరించినా బాధ్యత ఎవరిదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకుని రికార్డులు భద్రపరచాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 11:28 PM