Share News

‘ఆశ’ సేవలు విస్తృతం చేయాలి : డీపీఎంవో

ABN , Publish Date - May 07 , 2024 | 10:58 PM

పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తృతం చేయాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన పర్యవేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ అన్నారు.

‘ఆశ’ సేవలు విస్తృతం చేయాలి : డీపీఎంవో
ఆశ కార్యకర్తల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డీపీఎంవో డాక్టర్‌ రియాజ్‌బేగ్‌

రాయచోటిటౌన, మే7: పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తృతం చేయాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన పర్యవేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ అన్నారు. నెలలో మొదటి మంగళవారం ఆయన ఆశ దినోత్సవం సందర్భంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధి లోని నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆశకార్యకర్తల సమావేశాలను డీఎనఎంవో డాక్టర్‌ విష్ణువర్థనరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా డీపీఎంవో మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు తమకు నిర్దేశించిన గృహాలను క్రమం తప్పకుండా సందర్శింలని, రెఫర్‌ అవసరమైన వారిని పట్టణ ఆరోగ్య కేంద్రంలోని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి నెలా సమావేశాలకు హాజరై అజెండా ప్రకారం నిర్వహించే అంశాలపై అవగాహన పెంచుకో వాలన్నారు. తాము అందించే సేవలు ఈ-ఆశ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల అజెండా ప్రకారం శిశువుల్లో, పిల్లల్లో బిడ్డల పెరుగు దల, అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సమన్వ యం చేసుకోవాలన్నారు. బాల్య అభివృద్ధి నిర్మాణంలో లోపాలు ఉంటే డీఈఐసీ కేంద్రానికి వైద్యాధికారి ద్వారా రెఫర్‌ చేయించి సేవలు అందుచుటలో తల్లిదండ్రులకు తో డ్పాటు ఇవ్వాలన్నారు. గర్భిణులను 9వ తేదీ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమానికి తీసు కువచ్చి పరీక్షలు చేయించాలన్నారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైతే యూఎస్‌జీ స్కాన్స చేయించాలని సూచించారు. మాతృశిశు మరణాలు తగ్గించుటకు 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను వాడుకోవాలని తెలిపారు. ఈ యాప్‌లో ప్రతిరోజు లాగిన అవ్వాలన్నారు. అర్బనలో వ్యాఽ ది నిరోధక టీకాలు 100 శాతం అందేలా కృషి చేయా లన్నారు. డీఎనయంవో డాక్టర్‌ విష్ణువర్థనరెడ్డి మాట్లా డుతూ గుర్తించిన వారికి తప్పక బీసీజీ టీకా వేయించి ఆనలైనలో అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. మాతృకమిటీ, పట్టణ పోషణ, పారిశుధ్య కమిటీ సమావేశాల్లో వడదెబ్బ, వడగాలులు, మాతాశిశు సంరక్షణపై అవ గాహనకు హాజరైన తల్లులకు, లబ్ధిదారులకు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, డీపీవో మునీశ్వర్‌, పీఎంఎంవీవై జిల్లా సమన్వయకర్త విజయ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సుగుణ, ఆరోగ్య పర్యవేక్షకులు నూర్జహాన, పర్హాన, వారు సచివాలయ ఎనయంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 10:58 PM