వార్డు సచివాలయాల వద్ద సీపీఐ ఆందోళన
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:12 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లాకార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు.
కడప సెవెనరోడ్స్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లాకార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. సోమవారం స్థానిక సచివాలయం వద్ద జరిగిన ఆందోళనలో వారు మా ట్లాడారు. సీసీఐ నగర కార్యదర్శి ఎన.వెంకటశివ, గంగాసురేశ, మల్లిఖార్జున, శంకర్‌నాయక్, భాగ్యలక్ష్మి, బ్రహ్మం, నారాయణ పాల్గొన్నారు.
హామీని అమలు చేయాలి: సీపీఐ
ఎనడీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెర వేర్చాలని సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సోమవారం కడప నగరం 48వ డివిజన సచివాలయంలో అధికారులకు అర్జీదారులు అందజేశారు.