Share News

అక్రమ మద్యం నాటుసారాను ఉపేక్షించొద్దు

ABN , Publish Date - May 09 , 2024 | 12:14 AM

ఎన్నికల సమ యంలో నాటుసారా, అక్రమ మ ద్యం పట్ల ఉక్కుపాదం మోపాలని ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించొద్దని అనంతపురం సబ్‌ డివిజన డిప్యూటీ కమిషనర్‌ విజ యశేఖర్‌ ఆదేశించారు.

అక్రమ మద్యం నాటుసారాను ఉపేక్షించొద్దు
ఎస్‌ఈబీ సిబ్బందికి సూచనలిస్తున్న డిప్యూటీ కమిషనర్‌ విజయశేఖర్‌

వాల్మీకిపురం, మే 8: ఎన్నికల సమ యంలో నాటుసారా, అక్రమ మ ద్యం పట్ల ఉక్కుపాదం మోపాలని ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించొద్దని అనంతపురం సబ్‌ డివిజన డిప్యూటీ కమిషనర్‌ విజ యశేఖర్‌ ఆదేశించారు. బుధవారం ఆయన వాల్మీకిపురం ఎస్‌ఈబీ స్టేష నను ఆకస్మికంగా తనిఖీ చేసి రికా ర్డులు పరిశీలించారు. అనంతరం సి బ్బందితో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సీఐ సునంద, ఎస్‌ఐ షేక్‌ షావలి పాల్గొన్నారు.

ఎస్‌ఈబీ స్టేషనను సందర్శించిన డిప్యూటీ కమిషనర్‌

పీలేరు, మే 8: స్పెషల్‌ ఎనఫోర్స్‌మెంట్‌ బ్యూరో రాయలసీమ జోన డిప్యూటీ కమిషనర్‌ టి.విజయ శేఖర్‌ బుధవారం పీలేరు ఎస్‌ఈబీ స్టేషనను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషనలోని రికార్డులు పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం నివారణ, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాం డాక్ట్‌ అమలు, పాటించాల్సిన నిబంధనల గురించి సిబ్బందికి వివరించారు. అనంతరం చిత్తూరు మార్గంలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును సందర్శించి అక్కడ జరుగుతున్న వాహనాల తనిఖీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈబీ సీఐ శ్యాంప్రసాద్‌, ఎస్‌ఐ లక్ష్మీనరసయ్య, సిబ్బంది యోగానంద, గిరిబాబు, సుధాకర, సురేశ, రమేశ, జయభాను, గంగా మహేశ్వరి, పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:14 AM