Share News

ప్రతి సమస్యనూ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కమిషనర్‌

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:14 AM

కార్పొరేషన పరిధిలో ప్రజ లు తెలిపిన ప్రతి సమ స్యనూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కమిషనర్‌ మనోజ్‌రెడ్డి ఆదేశించారు.

ప్రతి సమస్యనూ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కమిషనర్‌
అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్‌ మనోజ్‌రెడ్డి

కడప ఎడ్యుకేషన, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన పరిధిలో ప్రజ లు తెలిపిన ప్రతి సమ స్యనూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కమిషనర్‌ మనోజ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కార్పొరేషన వీడియో కా న్ఫరెన్సహాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 28 అర్జీలు వచ్చాయన్నారు. ఇంజనీరింగ్‌ విభాగానికి సం బంధించి 13, టౌనప్లానింగ్‌ 6, రెవెన్యూ 6, హెల్త్‌ విభాగం 3 అర్జీలు వ చ్చాయన్నారు. అర్జీలను పరిశీలించి సం బంధిత శాఖాధికారులకు పం పించామన్నారు. ప్రతి అర్జీని సమయపాలన పాటించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అడిషనల్‌ కమిషనర్‌ రాకేశచంద్రం, డిప్యూటీ కమిషనర్‌ రాంబాబు, ఈఈ ధనలక్ష్మి, నారాయణస్వామి పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:14 AM