రాష్ట్రంలో దుర్మార్గపు పాలన : వైసీపీ
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:14 AM
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు.
కడప క్రైం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఇటీవల అరెస్టు అయ్యి కడప కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని మంగళవారం వారు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై కక్ష గట్టి వందల కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు అవుతున్నా ఎక్కడా సంక్షేమం కనిపించకపోవడంతో కొంతమంది సోషల్ మీడియాలో వారి బాధను వ్యక్తం చేస్తే అలాంటి వారిపై కూడా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమో దు చేసి అరెస్టు చేస్తున్నారన్నారు. అధికారులు కూడా నాయకులకు వత్తాసు పలకడం సరికాదని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుందని హెచ్చ రించారు. త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయని అప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.