Share News

ఇకపై పీహెచసీల్లో ఉచితంగా స్కానింగ్‌

ABN , Publish Date - May 08 , 2024 | 10:58 PM

ఎంపిక చేసిన పీహెచసీలలో ఇకపైౖ ఉచితంగా స్కానింగ్‌ సౌకర్యం అందుబాటులోకి రా నుందని అన్నమయ్య జిల్లా పీసీపీఎనడీటీ చట్టం (గర్భస్థ పిండ లిం

ఇకపై పీహెచసీల్లో  ఉచితంగా స్కానింగ్‌
వైద్యాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న నోడల్‌ అధికారి డాక్టర్‌ ఉషశ్రీ

ఇకపై పీహెచసీల్లో ఉచితంగా స్కానింగ్‌

రాయచోటిటౌన, మే 8: ఎంపిక చేసిన పీహెచసీలలో ఇకపైౖ ఉచితంగా స్కానింగ్‌ సౌకర్యం అందుబాటులోకి రా నుందని అన్నమయ్య జిల్లా పీసీపీఎనడీటీ చట్టం (గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం) నోడల్‌ అధికారి డాక్టర్‌ ఉష శ్రీ అన్నారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రం లోని డీఎం హెచవో కార్యాలయంలో డీఐవో అధ్యక్షతన మొలకల చెరువు, కురబలకోట, పెద్దమండెం, పీటీయం, నందలూర్‌, చిట్వూల్‌, రామాపురం, గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా పీహెచసీల లో గర్భిణులకు స్కాన చేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా మన్నారు. ఇందుకు గానూ సంబంధించిన పీహెచసీల వైద్యులకు పీసీపీఎన డీటీ చట్టం ప్రొటోకాల్‌, ప్రమాణాల కు సంబంధించి ఆయా పీహెచసీలు రిజిస్ర్టేషన చేసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి పీసీపీఎన డీటీ చట్టం అమలు సభ్యులు డాక్టర్‌ వెంకటశివ, డాక్టర్‌ జీనతబేగం, డిప్యూటీ డెమో దేవశిరోమణి, పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:58 PM