Share News

Oman ఒమన నుంచి స్వదేశానికి..

ABN , Publish Date - Sep 17 , 2024 | 11:38 PM

ఒమన దేశంలో తమ తల్లి ఇబ్బందులు పడుతోందని, వెంటనే ఇండియాకు రప్పించాలని బాధితురాలి పిల్లలు, భర్త ఎస్పీని కోరడంతో వెంటనే స్పందించిన ఆయన 24 గంటల్లోనే ఆ మహిళను స్వదేశానికి రప్పించారు. వివరాలిలా ఉన్నాయి.

 Oman ఒమన నుంచి స్వదేశానికి..
ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న షహీనా, ఆమె భర్త, పిల్లలు

మహిళను 24 గంటల్లోనే రప్పించిన ఎస్పీ

రాయచోటి టౌన, సెప్టెంబరు 17: ఒమన దేశంలో తమ తల్లి ఇబ్బందులు పడుతోందని, వెంటనే ఇండియాకు రప్పించాలని బాధితురాలి పిల్లలు, భర్త ఎస్పీని కోరడంతో వెంటనే స్పందించిన ఆయన 24 గంటల్లోనే ఆ మహిళను స్వదేశానికి రప్పించారు. వివరాలిలా ఉన్నాయి. గాలివీడు మండలం పెద్దూరు గ్రామానికి చెందిన హసనాపురం షహీన బతుకుదెరువు కోసం ఈ ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్‌ నుంచి ఒమనకు వెళ్లింది. ఏజెంట్‌ మోసపూరిత వీసా తీయడంతో అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఇక్కడ తనను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని విలపిస్తూ పంపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆమె అక్కడ పడుతున్న ఇబ్బందులపై ఆమె భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఈనెల 10న ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుకు సమస్యను చెప్పారు. వెంటనే ఎస్పీ స్పందించి సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడి కేవలం 24 గంటల్లోనే బాధితురాలిని స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టారు. ఈనెల 11న ఒమన నుంచి బయలుదేరిన షహీనా ఈనెల 12వ తేదీ బుధవారం సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. దీంతో మంగళవారం షహీనా తన భర్త, పిల్లలతో ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - Sep 17 , 2024 | 11:38 PM