Share News

హజ్‌ యాత్రికులు వ్యాక్సినేషన చేయించుకోవాలి

ABN , Publish Date - May 08 , 2024 | 10:56 PM

హజ్‌ యాత్రికులు వ్యాక్సినేషన క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన పర్యవేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ అన్నారు.

హజ్‌ యాత్రికులు వ్యాక్సినేషన చేయించుకోవాలి
హజ్‌ యాత్రికుల వ్యాక్సినేషన కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డీపీఎంవో డాక్టర్‌ రియాజ్‌బేగ్‌

రాయచోటిటౌన, మే8: హజ్‌ యాత్రికులు వ్యాక్సినేషన క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన పర్యవేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ అన్నారు. బుధవారం ఆయన డీఎనఎంవో డాక్టర్‌ విష్ణువర్ధనరెడ్డితో కలిసి హజ్‌యాత్ర వ్యాక్సినేషన క్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ నుంచి 9వ తేదీ వరక హజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో నాలుగు బృందాలతో నిర్వహిస్తామని, ఒక్కో బృందంలో వైద్యాధికారితో పాటు 7 మంది సభ్యులు ఉంటారన్నారు. ఈ నాలుగు బృందాలను పర్యవేక్షణ అధికారిగా డాక్టర్‌ సునీతను నియమించామ న్నారు. రాయచోటి శిబిరంలో మొత్తం 120 మంది హజ్‌ యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి టీకాలు వేస్తా మన్నారు. మదనపల్లె పట్టణంలోని జిల్లా ప్రధాన వైద్య శాలలోని డీఈఐసీ కేంద్రంలో డాక్టర్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో నాలుగు బృందాలు టీకాలు వేయడం జరుగుతోందన్నారు. మదనపల్లెలో 150 మంది హజ్‌ యాత్రికులకు పోలియో, మెయింజో కొకల్‌, ఇనఫ్లుఎంజా వ్యాక్సిన్స వేస్తామన్నారు. వ్యాక్సినేషన అనంతరం వారికి సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. ఈ శిబిరాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని, హజ్‌ యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సునీత, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:56 PM